Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ లాయర్ కు, ఈ లాయర్ కు ఎంత తేడా!

ఆ లాయర్ కు, ఈ లాయర్ కు ఎంత తేడా!

యాదృచ్ఛికమే అయినప్పటికీ వారం గ్యాప్ లో లాయర్ గెటప్స్ లో థియేటర్లలోకి వచ్చారు వరలక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్. ఇద్దరు హీరోయిన్లు ఇలా ఒకే గెటప్ తో మినిమం గ్యాప్ లో థియేటర్లలోకి రావడంతో ఆటోమేటిగ్గా కంపారిజన్ మొదలైంది. అయితే ఈ పోటీలో వరలక్ష్మిదే గెలుపు.

నాంది సినిమాలో లాయర్ ఆద్య ముల్లపూడి పాత్రలో వరలక్ష్మి పెర్ ఫెక్ట్ గా సూట్ అయింది. ఆమె సీరియస్ లుక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. కానీ చెక్ సినిమాలో లాయర్ మానసగా కనిపించిన రకుల్ మాత్రం ఆ సీరియస్ నెస్ ను చూపించలేకపోయింది.

నాందిలో లాయర్ ఆద్య పాత్రలో ఓ ఆర్క్ ఉంది. ఓ సీరియస్ ఇష్యూ కోసం ఆమె చేసిన పోరాటం, తీక్షణత దశలవారీగా కనిపిస్తుంది. కానీ చెక్ లో లాయర్ మానస పాత్రలో అది మిస్సయింది. 

ముందు అమాయకంగా పరిచయం చేశారు. ఆ తర్వాత కేసును సీరియస్ గా తీసుకునే లాయర్ గా రకుల్ ను చూపించారు. కానీ ఈ రూపాంతరాన్ని సరిగ్గా చూపించలేదు. దీంతో రకుల్ పాత్ర సగం ఉడికిన వంటకంలా మారింది.

ఇక్కడ ఈ పాత్రల్ని పోషించిన హీరోయిన్ల కంటే, వాటిని రాసిన దర్శకుల్నే తప్పుపట్టాల్సి ఉంటుంది. ఆద్య పాత్రను దర్శకుడు విజయ్ కనకమేడల చక్కగా రాసుకున్నాడు. అదే చెక్ విషయానికొస్తే, మానస పాత్రను సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. 

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?