cloudfront

Advertisement


Home > Movies - Movie News

వినయ విధేయలో 'గ్యాంగ్ లీడర్' ఉన్నాడా?

వినయ విధేయలో 'గ్యాంగ్ లీడర్' ఉన్నాడా?

గ్యాంగ్ లీడర్ లో హీరోకు ఓ కుటుంబం ఉంటుంది. అందులో అన్నయ్య పాత్ర చనిపోతుంది. హీరో అన్నీ తానై కుటుంబాన్ని ఆదుకుంటాడు. వినయ విధేయరామ సినిమాలో కూడా హీరోకు ఓ అందమైన కుటుంబం ఉంటుంది. ఇందులో కూడా ఓ అన్నయ్య చనిపోతాడు. ఆ కుటుంబాన్ని హీరో ఆదుకుంటాడు. ఈ రెండు సినిమాల్లో హీరో పాత్రలు పక్కా మాస్ లుక్ లోనే ఉంటాయి.

అయితే ఈ పోలికను రామ్ చరణ్ అంగీకరించడం లేదు. తను నటించిన వినయ విధేయ రామకు, గ్యాంగ్ లీడర్ కు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఈ హీరో. వినయ విధేయ రామలో నా పాత్రకు గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి పాత్రకు సంబంధం లేదు.

గ్యాంగ్ లీడర్ కు ఈ సినిమాకు సంబంధం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. టోటల్ గా వేరే సబ్జెక్ట్. గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉంది. కానీ ఇది ఆ సినిమా కాదు. గ్యాంగ్ లీడర్ తరహాలోనే వినయ విధేయ రామలో కూడా అన్నపాత్ర చనిపోతుందని, కానీ ఆ రెండు సినిమాలకు ఎలాంటి పోలికలు ఉండవని అంటున్నాడు రామ్ చరణ్.

వినయ విధేయరామ సినిమా చూస్తే ఎక్కడా గ్యాంగ్ లీడర్ గుర్తుకురాదని చెబుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ సినిమా సంక్రాంతి కానుకగా రేపు థియేటర్లలోకి రాబోతోంది. కైరాఅద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. 

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది