Advertisement

Advertisement


Home > Movies - Movie News

లాక్ డౌన్.. అఫీషియల్ గా షూటింగ్స్ బంద్

లాక్ డౌన్.. అఫీషియల్ గా షూటింగ్స్ బంద్

నిన్నటివరకు పెద్దగా ఆంక్షలు లేవు. మార్గదర్శకాలు కూడా అంతంతమాత్రమే. ఇష్టం ఉన్నవాళ్లు షూటింగ్స్ చేసుకున్నారు. ఇష్టం లేనివాళ్లు ఆపుకున్నారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు నడుచుకున్నారు. అయితే ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అంటే, అధికారికంగా షూటింగ్స్ బంద్ అయినట్టే.

దాదాపు 10కి పైగా చిన్న సినిమాలు ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్లు షూటింగ్స్ కొనసాగిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తై షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. 

లాక్ డౌన్ విషయం తెలిసిన వెంటనే రజనీకాంత్, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని కొందరు, ఇంకా పెండింగ్ ఉందని మరికొందరు చెబుతున్నారు.

అటు ఆదిపురుష్ యూనిట్ మరో 4 రోజుల్లో ఇక్కడే కొత్త షెడ్యూల్ పెట్టుకుంది. మరోవైపు అఖండ కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇవి కాకుండా వెబ్ సిరీస్, ఒరిజినల్ మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. తాజా లాక్ డౌన్ తో ఇవన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

అటు టీవీ రంగంపై కూడా లాక్ డౌన్ ప్రభావం గట్టిగా పడబోతోంది. అన్ని ఛానెళ్లు తమ సీరియల్ షూటింగ్స్ ను కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఢీ, జబర్దస్త్ లాంటి నాన్-ఫిక్షన్ సీరియల్స్ షూటింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ ఈరోజుతో ఆగిపోయాయి. 

బ్యాంకింగ్ ఉన్న ఛానెల్స్.. ఈ 10 రోజులు షో నడిపిస్తాయి. బ్యాంకింగ్ లేని ఛానెళ్లు మరోసారి రిపీట్ బాట పట్టబోతున్నాయి. సీరియల్స్, నాన్-ఫిక్షన్ షోల స్థానంలో రిపీట్ సినిమాలు ప్రసారం చేయబోతున్నాయి.

పేరుకు 10 రోజులు మాత్రమే లాక్ డౌన్ అని ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ ను ఇంకొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్, టీవీ పరిశ్రమ మళ్లీ ఎప్పటికి పూర్వ స్థితికి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?