Advertisement

Advertisement


Home > Movies - Movie News

తండ్రి టైటిల్ తో కూతురి సినిమా!

తండ్రి టైటిల్ తో కూతురి సినిమా!

'ల‌వ్ ఆజ్ క‌ల్' సారా అలీ ఖాన్ కొత్త సినిమా పేరు. అందుకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు. కార్తిక్ ఆర్య‌న్, సారా లు ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తూ ఉన్నారు. దీని ట్రైల‌ర్ మ‌రి కొన్ని గంట‌ల్లో విడుద‌ల కానుంది. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల అయ్యే అవ‌కాశాలున్నాయి. ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతూ ఉంది.

విశేషం ఏమిటంటే దాదాపు 11 యేళ్ల కింద‌ట సైఫ్ అలీ ఖాన్ హీరోగా ఇదే టైటిల్ తో సినిమా వ‌చ్చింది. దీపికా ప‌డుకునే, సైఫ్ లు న‌టించిన ఆ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయ్యింది. ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలోనే ఆ సినిమా రూపొందింది. ఆ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. హిందీలో సూప‌ర్ హిట్ అయ్యాకా.. రెండు మూడేళ్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ దాన్ని తెలుగులో తీన్ మార్ గా రీమేక్ చేశాడు. తెలుగులో ఆ సినిమా అంత‌గా ఆడ‌లేదు.

ఒరిజిన‌ల్ వచ్చిన 11 యేళ్ల‌కు అదే డైరెక్ట‌ర్ ఇప్పుడు అదే పేరుతో ఒక సినిమాను రూపొందిస్తూ ఉన్నాడు. అదేమంటే..గ‌త ప‌దేళ్లలో ప్రేమ విష‌యంలో యువ‌త ధోర‌ణిలో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని అంటున్నాడు. 11 యేళ్ల కింద‌టి ల‌వ్ ఆజ్ క‌ల్ లో.. రెండు త‌రాల మ‌ధ్య‌న ప్రేమ గురించిన అంత‌రాన్ని అందంగా చూపించాడు ఇంతియాజ్ అలీ. ఇప్పుడు కూడా 1990కి 2020కి ప్రేమ‌లో వ‌చ్చిన అంత‌రాన్ని ల‌వ్ ఆజ్ క‌ల్ గా ప్ర‌జెంట్ చేస్తూ ఉన్న‌ట్టున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?