లవ్ స్టోరీ…డిసైడ్ మేకర్

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా కేసి చూస్తోంది. ఆ సినిమా ఎలా వుంటుంది? హిట్ అవుతుందా? కాదా? ఇందుకోసం కాదు.  Advertisement ఆ సినిమాకు ఫ్యామిలీలు వస్తాయా? రావా?…

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా కేసి చూస్తోంది. ఆ సినిమా ఎలా వుంటుంది? హిట్ అవుతుందా? కాదా? ఇందుకోసం కాదు. 

ఆ సినిమాకు ఫ్యామిలీలు వస్తాయా? రావా? అదీ సమస్య. కరోనా మొదటి విడత తరువాత సినిమాలు వస్తే జనం దూసుకువచ్చారు. కానీ కరోనా రెండో విడత తరువాత సీన్ అలా లేదు. మంచి మాస్ సినిమా పడాలి…మంచి క్లాస్ సినిమా పడాలి అంటూ కారణాలు వెదుక్కుంటూ వచ్చారు,

సీటీమార్ లాంటి మాంచి మాస్ సినిమా పడింది. అయినా జనాలు మూడు రోజుల తరువాత తగ్గిపోయారు.. సరే ఇక మిగిలింది మాంచి క్లాస్ సినిమా. ఫ్యామిలీలను బయటకు రప్పించే సినిమా. అదే లవ్ స్టోరీ. అందుకే ఇన్ని ఆశలు. 

సినిమా విడుదల తరువాత టాక్, దాని బట్టి రావడం, రాకపోవడం అన్న సంగతి అలా వుంచితే, అసలు మొదటి మూడు రోజులు ఫ్యామిలీలు ఏమైనా ఆసక్తి కనబరుస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా వుంది. 

ఫ్యామిలీలు అలా వస్తే..ఇక సినిమాలు చకచకా ముందుకు కదుల్తాయి. వారానికి ఒకటి కాదు రెండు మూడు వచ్చి పడతాయి. లేదూ సినిమా ఓకె అనిపించుకుని కూడా ఫ్యామిలీలు రాకపోతే ఇక చాలా సినిమాలు ఓటిటి దారిన పట్టేస్తాయి. ఇలా వ్యవహారం చక్క బెట్టుకోవడానికి దాదాపు అరడజను చిన్న సినిమాలు రెడీగా చూస్తున్నాయి.