నాగ్ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీకి మంచి అప్లాజ్ వచ్చింది. సర్రున ఓపెనింగ్ పడింది. ఇండస్ట్రీకి ధైర్యం వచ్చి చకచకా డేట్ లు పడ్డాయి. కానీ ఫస్ట్ వీక్ రిజల్ట్ పూర్తి సంతృప్తికరంగా లేదు.
సినిమాను వెస్ట్, నెల్లూరు, సీడెడ్ మాత్రమే విక్రయించారు. విశాఖ, ఈస్ట్, కృష్ణ, నైజాం ఓన్ డిస్ట్రిబ్యూషన్. నెల్లూరు పెద్ద మొత్తం కాదు కానీ, వెస్ట్, సీడెడ్ ల్లో కాస్త గట్టి నష్టాలు తప్పవని తెలుస్తోంది. రెండు చోట్ల కూడా కొటి రూపాయల వంతున ఇంకా రికవరీ కావాల్సి వుంది.
ఇదిలా వుంటే విశాఖలో ఫస్ట్ వీక్ రెండు కోట్ల వరకు వసూలు చేసింది. ఇకపై వరుసగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. మరి లవ్ స్టోరీ వసూళ్లు ఎలా వుంటాయో చూడాలి. ఫిదా టోటల్ రన్ లో విశాఖ నాలుగున్నర కోట్లు వసూలు చేసింది. లవ్ స్టోరీ ఆ రేంజ్ కు చేరడం కష్టం అనే అనుకోవాలి.
నైజాంలో కూడా లవ్ స్టోరీ ఇప్పటికి పది కోట్ల రేంజ్ కు చేరింది. ఫిదా టోటల్ రన్ లో 18 కోట్లకు పైగా వసూలు చేసింది. దసరా సీజన్ వరకు లవ్ స్టోరీ స్టడీగా రన్ అయితే ఏ మేరకు వెళ్తుంది అన్నది చూడాలి. కలెక్షన్ల విషయం పక్కన పెడితే నిర్మాతకు మాత్రం లాభాలు పండించిందనే చెప్పాలి.
సినిమాకు పబ్లిసిటీ, వడ్డీలు అన్నీ కలిపితే 35 నుంచి 36 కోట్ల వరకు ఖర్చయింది. నాన్ థియేటర్ మీద 22 కోట్లకు పైగా వచ్చింది. నైజాంలోనే ఇప్పటికి పది కోట్లు రికవరీ వచ్చింది. థియేటర్ అమ్మకాల మీద సీడెడ్ 3.30, వెస్ట్ 2.50 వంతున వచ్చాయి. ఇవి కాక ఓవర్ సీస్, నెల్లూరు వుండనే వున్నాయి.
మొత్తం మీద 42 కోట్ల వరకు రికవరీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ విధంగా మంచి లాభాలే నిర్మాతకు.