Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ల‌వ్ స్టోరీ' ఫ‌స్ట్ లుక్.. రొటీన్ కు భిన్న‌మేనా?

'ల‌వ్ స్టోరీ' ఫ‌స్ట్ లుక్.. రొటీన్ కు భిన్న‌మేనా?

టాలీవుడ్ లో మ‌ళ్లీ రొటీన్, సింపుల్ టైటిల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. 'ఫిదా' అంటూ సింపుల్ టైటిల్ తో వ‌చ్చి ఫామ్ లోకి వ‌చ్చిన శేఖ‌ర్ క‌మ్ముల ఈ సారి అలాంటి సింపుల్ టైటిల్ తోనే ప‌ల‌క‌రిస్తూ ఉన్నాడు. ల‌వ్ స్టోరీ అంటూ వ‌స్తున్నాడు. నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విలు జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా గురించి ఈ టైటిల్ కొన్నాళ్లుగా ప్ర‌చారంలో ఉంది. చివ‌ర‌కు ఆ టైటిల్ నే ఖ‌రారు చేశారు. సంక్రాంతి సంద‌ర్భంగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. 

హీరో,హీరోయిన్ల‌ను చూపిస్తూ సింపుల్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. టైటిల్ లాగానే ఈ ఫ‌స్ట్ లుక్ కూడా సింపుల్ గానే ఉంది. ప్రేమ తాలూకు గాఢ‌త‌ను ప్ర‌జెంట్ చేసేలా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ఏఆర్ రెహ‌మాన్ శిష్య‌గ‌ణంలో ఒక‌డైన ప‌వ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడ‌ట‌.  స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా విడుద‌ల కాబోతున్న ఈ సినిమాను శేఖ‌ర్ క‌మ్ముల త‌న అమిగోస్ క్రియేష‌న్స్ పై నిర్మిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?