Advertisement

Advertisement


Home > Movies - Movie News

జీవిత త‌న‌య‌కు ల‌క్కీ చాన్స్‌

జీవిత త‌న‌య‌కు ల‌క్కీ చాన్స్‌

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల త‌న‌య శివానీ రాజ‌శేఖ‌ర్ కోలీవుడ్‌లో ల‌క్కీచాన్స్ కొట్టింది. త‌మిళ చిత్రంలో తాజా సీఎం స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. 

రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కుమార్తె శివానీ, చిన్న‌కుమార్తె శివాత్మిక‌. చిన్న కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్ త‌ల్లిదండ్రుల న‌టనా వార‌సురాలిగా మొట్ట మొద‌ట చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. దొరసాని సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు శివాత్మిక పరిచయం అయ్యారు.

ఆ త‌ర్వాత శివానీ రాజ‌శేఖ‌ర్ 2 స్టేట్స్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ప్ర‌స్తుతం గుహన్‌ దర్శకత్వంలో ఆమె ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదిత్‌ అరుణ్ సరసన చేస్తున్నారామె. ఈ సినిమా ఫస్ట్‌ లుక్ కూడా విడుదలైంది. కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. అలాగే ‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జతో మరో మూవీకి శివానీ సైన్ చేశారు.  

ఇదిలా ఉండ‌గా కోలీవుడ్‌లో ఓ క్రేజీ సినిమా చేసేందుకు, అందులోనూ ముఖ్య‌మంత్రి కుమారుడు, యువ ఎమ్మెల్యే ఉద‌య‌నిధి స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం రావ‌డం ఎంతో అదృష్టం అని చిత్ర‌ప‌రిశ్ర‌మ చెబుతోంది. 

హిందీలో విమర్శకులు ప్రశంసలం దుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్న తమిళ సినిమాలో శివానీ న‌టించ‌నున్నారు. అరుణ్‌రాజ కామ రాజ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను బోనీకపూర్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే శివానీ కెరీర్ మ‌లుపు తిరుగుతుంద‌ని చెప్పొచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?