cloudfront

Advertisement


Home > Movies - Movie News

సినీఫక్కీలో సినిమా హీరోయిన్ పెళ్లి

సినీఫక్కీలో సినిమా హీరోయిన్ పెళ్లి

పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు సిద్ధం. ఇక తాళి కట్టడమే ఆలస్యం. సరిగ్గా అదే సమయంలో సీన్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. పెళ్లికొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎన్నో పాత సినిమాల్లో చూసిన సన్నివేశం ఇది. కానీ ఈసారి ఇది రియల్ గా జరిగింది. అది కూడా హీరోయిన్ మాదాలస శర్మ విషయంలో జరిగింది. 

బాలీవుడ్ సీనియర్ నటుడు మిధున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్, హీరోయిన్ మదాలసా శర్మ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఊటీలో మిధున్ చక్రవర్తికి చెందిన ఓ స్టార్ హోటల్ లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. సరిగ్గా అదే టైమ్ లో ఓ యువతి, మహాక్షయ్ పై కేసుపెట్టింది. తనను లైంగికంగా వేధించాడంటూ ఆ యువతి ఆరోపించడంతో మహాక్షయ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

అయితే సినిమాల్లో చూపించినట్టు ఇక్కడ హీరోయిన్ పెళ్లి ఆగిపోలేదు. కాకపోతే కాస్త ఆలస్యంగా జరిగిందంతే. 7వ తేదీన జరగాల్సిన మహాక్షయ్-మదాలసా శర్మ వివాహం, నిన్న రాత్రి జరిగింది. వేదిక మాత్రం మారలేదు. బెయిల్ పై విడుదలైన మహాక్షయ్, నిన్న రాత్రి ఊటీలోని తన సొంత హోటల్ లో మాదాలసాను పెళ్లి చేసుకున్నాడు. 

7వ తేదీ పెళ్లికి అందర్నీ గ్రాండ్ గా ఆహ్వానించిన మిధున్ చక్రవర్తి, నిన్న రాత్రి మాత్రం సీక్రెట్ గా కొడుకు పెళ్లి చేశాడు. కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లిలో కనిపించారు. మరోవైపు మహాక్షయ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తున్న అమ్మాయి కూడా బాలీవుడ్ కు చెందిన నటి కావడం విశేషం. ఆమె భోజ్ పురి, హిందీ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించింది. 2015 నుంచి మహాక్షయ్, ఈ బాలీవుడ్ నటి ప్రేమించుకుంటున్నారట. 

మొత్తానికి మదాలసా శర్మ పెళ్లి మాత్రం ఇలా సినీఫక్కీలో జరగడం ఆమెకు కలకాలం గుర్తుండిపోతుంది. భర్తపై రేప్ కేసు నమోదైనా ఏమాత్రం ఆలోచించకుండా మహాక్షయ్ ను పెళ్లాడింది మదాలస. తెలుగులో ఈమె ఫిట్టింగ్ మాస్టర్, ఆలస్యం అమృతం లాంటి సినిమాల్లో నటించింది.