Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహసముద్రంలో 'అను'

మహసముద్రంలో 'అను'

తెలుగులో మరీ కుమ్మేసే లెవెల్లో కాకపోయినా, కంటిన్యూగా సినిమాలు వస్తూనే వున్నాయి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు. చైతన్య పక్కన చాన్స్ వచ్చినా సక్సెస్ మాత్రం వరించలేదు.

లేటెస్ట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినినమా చేస్తోంది. ఆ సినిమా పూర్తయ్యేలోగానే మరో మంచి చాన్స్ వచ్చింది.

అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్ట్ మహా సముద్రంలో రెండో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం శర్వానంద్, సిద్దార్ద, అదితి రావ్ హైదరిని తీసుకున్నారు.

మహా సముద్రం పూర్తిగా ఎమోషనల్ పెర్ ఫార్మెన్స్ కు అవకాశం వున్న సినిమా. శర్వా, సిద్దార్ద, అదితిరావ్ హైదరి వరకు మాంచి ఎంపికే అనుకోవాలి. 

కానీ అను నుంచి ఏ రేంజ్ నటన ఎలా రాబడతారో చూడాలి. ఇది ఒక్కటీ డైరక్టర్ అజయ్ భూపతికి కాస్త గట్టి టాస్క్ నే కావచ్చు. ఈ సినిమా లో కనుక అను పాస్ అయితే ఇండస్ట్రీలో కాస్త నిలదొక్కుకోవచ్చు.

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?