cloudfront

Advertisement


Home > Movies - Movie News

అశ్వనీదత్ జాక్ పాట్: రూ.5 కోట్లు ఎక్స్ ట్రా

అశ్వనీదత్ జాక్ పాట్: రూ.5 కోట్లు ఎక్స్ ట్రా

మహానటి రిలీజ్ కు ముందు మేటర్ ఇది. రిలీజ్ టైమ్ లో అశ్వనీదత్ కు డబ్బు అవసరమైంది. సినిమా ప్రచారానికి, ప్రింట్ ఖర్చులు, ఇతరత్రా వ్యవహారాల కోసం అర్జెంట్ గా డబ్బు కావాలి. ఏపీ, నైజాంలో చాలా ఏరియాల్లో సొంత రిలీజ్ కు వెళ్లాడు కాబట్టి డబ్బు మరింత అత్యవసరం. అలాంటి టైమ్ లో మహానటి సినిమా ఓవర్సీస్ రైట్స్ అమ్మేద్దామనుకున్నాడు దత్తు. కనీసం 7కోట్లు వస్తే చాలనుకున్నాడు.

కానీ మహానటి సినిమాను విడుదలకు ముందు కొనడానికి ఏ ఛానెల్ ముందుకురాలేదు. జీ తెలుగు ఛానెల్ 5కోట్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే.. ఆ మొత్తానికి మరో 60లక్షలు అదనంగా ఇవ్వడానికి జెమినీ ముందుకొచ్చింది. కానీ అశ్వనీదత్ మాత్రం సినిమాను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కట్ చేస్తే.. మహానటి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు అమాంతం క్రేజ్ పెరిగింది.

7కోట్ల రూపాయలు వస్తే చాలనుకున్న అశ్వనీదత్ ఈసారి రేటు పెంచారు. శాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 15కోట్లు చెప్పారు. ఎన్నో చర్చల అనంతరం జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా తెలుగు, తమిళ శాటిలైట్ రైట్స్ ను 11కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అలా అటుఇటుగా 6కోట్లకు అమ్ముడుపోవాల్సిన సినిమా 11కోట్లకు వెళ్లింది. అంటే అశ్వనీదత్ కు ఈ ఒక్క యాంగిల్ లోనే 5కోట్ల రూపాయల అదనపు రాబడన్నమాట. 

మరోవైపు సొంత రిలీజ్ కు వెళ్లడంతో ఏపీలోని చాలా సెంటర్ల నుంచి అశ్వనీదత్ కు లాభాలు రాబోతున్నాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే.. ఈ వీకెండ్ నాటికి మహానటి సినిమా నైజాం, ఉత్తరాంధ్ర మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నుంచి అశ్వనీదత్ కు అన్నీ లాభాలే.