cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహానటి టీజర్.. మేకప్.. గెటప్ ఓకె

మరో నెల రోజుల్లో జనాల ముందుకు రాబోతున్న మహానటి సినిమా టీజర్ బయటకు వచ్చింది. ఫస్ట్ లుక్ లు, మేకప్ స్టిల్స్ పక్కన పెడితే వచ్చిన సరైన ఇన్ ఫర్మేటివ్ వ్యవహారం ఇదే. మహానటి టీజర్ ఎలా వుంటుందో అని జనం ఆసక్తిగా ఎదురుచూడడం వరకు ఓకె. కానీ ఆ అంచనాలు అందుకునేంత అద్భుతంగా అయితే ఈ టీజర్ లేదనే చెప్పాలి. 

అలనాటి వాతావరణం, సావిత్రిగా కీర్తి సురేష్ మేకప్, అలనాటి సావిత్రి పాత్రల రీ ప్రొడక్షన్ వరకు టీజర్ బాగానే వుంది. కానీ టీజర్ చూడగానే 'సూపర్.. అదిరిందిగా' అనే రెంజ్ కు మాత్రం లేదనే చెప్పాలి. అయితే ఇది టీజరే కాబట్టి, ఇంతకన్నా ఎక్కువగా చెప్ప లేకపోవచ్చు. గతంలో మహానటి టైటిల్ ను మాయాబజార్ మాయా దర్పణంలో వదిలిన వీడియో బైట్ తో పోల్చుకుంటే, అదే బాగుంది అనిపిస్తుంది.

అయితే అలనాటి వాతావరణం రూపకల్పన, సావిత్రిగా కీర్తి సురేష్ మేకప్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. టీజర్ లో ప్రస్తుతానికి మహానటిగా సావిత్రి చరిష్మా, సినిమాలు, ప్రేమ వ్యవహారం మాత్రం టచ్ చేసారు. అయితే సావిత్రి జీవితంలో పాత్రల కన్నా, భావోద్వేగాలు, బాంధవ్వాలు, ఉద్దానపతనాలు కీలకం. అవి లైట్ గా టచ్ చేసి వుంటే బాగుండేది.

సినిమాలో సావిత్రి పాత్రతో పాటు, సమంత, విజయ్ దేవరకొండ పాత్రలకు కూడా ప్రాధాన్యత వున్నట్లుంది. ఎందుకంటే వారి కోణంలోనే కథ నడుస్తుంది కాబట్టి. అందువల్ల వాళ్లను కాస్త చూపించారు.

కీలకమైన ఎన్టీఆర్, ఎఎన్నార్, ఎస్వీఆర్ పాత్రలను చూపిస్తే, సినిమాపై ఆసక్తి ఇప్పుడే పూర్తయిపోతుంది కాబట్టి చూపించలేదు అనుకోవాలి.