cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహానాయకుడికి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పోటు.!

మహానాయకుడికి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పోటు.!

ఈ నెలలో సినిమా విడుదల కావడం కష్టమేనని అంతా అనుకుంటున్న తరుణంలో, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేసేసింది 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' టీమ్‌. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఎన్టీఆర్‌ బయోపిక్‌ టీమ్‌ ప్రకటించిన వెంటనే, రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చేశాడు.

ఫిబ్రవరి 14న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ విడుదల కానున్న విషయం విదితమే. దానికి సంబంధించి వర్మ సోషల్‌ మీడియాలో చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక, వర్మ ఇచ్చిన తాజా అప్‌డేట్‌ ఏంటంటే, 'ఎన్‌టీఆర్‌ మహానాయకుడు' ప్రదర్శితమయ్యే థియేటర్లలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ని ప్రదర్శించబోతున్నారట. మామూలుగా అయితే ఓ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నప్పుడు, ఇంకో కొత్త సినిమా ట్రైలర్‌ ప్రదర్శితమవడం కొత్త విషయమేమీ కాదు.

కానీ, ఇక్కడ సీన్‌ వేరు. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'ని బావ చంద్రబాబు కోసం నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పేరుకి క్రిష్‌ దర్శకుడే అయినా, బాలకృష్ణ తనకు నచ్చినట్లుగానే సినిమా పనులు జరిగేలా చూసుకుంటోన్న విషయం విదితమే. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలో 'రాజకీయం' ఎపిసోడ్‌కి సంబంధించి చంద్రబాబు పాత్ర కీలకం. 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ వెన్నుపోటు ఎపిసోడ్‌ని ఎటూ బాలయ్య, తన బావకు కావాల్సిన విధంగానే తెరకెక్కిస్తారు.

అయితే, రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌ చుట్టూనే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని నడిపించబోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్‌ అయినప్పటినుంచీ కథ మొదలవుతుందని 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మీద ఇప్పటికే వర్మ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఒక్కటి మాత్రం నిజం.. బోల్డంత హంగామా చేసి, భారీగా ఖర్చుచేసి 'ఎన్టీఆర్‌ బయోపిక్‌'ని రెండు పార్టులుగా (కథా నాయకుడు, మహానాయకుడు) బాలయ్య రూపొందిస్తే, వర్మ సింపుల్‌గా తన పని కానిచ్చేస్తున్నాడు.

బాలయ్య 'ఎన్టీఆర్‌'తో పోల్చితే, వర్మ 'ఎన్టీఆర్‌' నటీనటుల పరంగానూ చాలా చిన్న సినిమానే. 'కథానాయకుడు'కి మంచి రేటింగ్స్‌ వచ్చినా, డిజాస్టర్‌గా మిగలడంతో, 'మహానాయకుడు'పై బజ్‌ ఏమాత్రం లేకుండా పోయింది. వర్మ పరిస్థితి వేరు. వర్మ గత సినిమాలన్నీ డిజాస్టర్లే అయినా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ వేడి నేపథ్యంలో 'వెన్నుపోటు'ని వర్మ ఎలా తెరకెక్కించి వుంటాడన్న ఉత్కంఠ చాలామందిలో వుంది. అదే వర్మకి కోట్ల రూపాయల పబ్లిసిటీతో సమానం.

కొసమెరుపేంటంటే, 'మహానాయకుడు' ఇంకాస్త లేటయివుంటే దానికి పోటీగా వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని తీసుకురావాలనుకున్నాడట. 

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు