cloudfront

Advertisement


Home > Movies - Movie News

జాగ్రత్తపడిన మహేష్.. బాగానే కవర్ చేశాడు

జాగ్రత్తపడిన మహేష్.. బాగానే కవర్ చేశాడు

ముచ్చటగా మూడోసారి మహేష్ కాలర్ ఎగరేస్తాడని అంతా భావించారు. కానీ అది జరగలేదు. విజయవాడలో జరిగిన మహర్షి సక్సెస్ సంబరాల్లో మహేష్ కేవలం అందరికీ థ్యాంక్స్ మాత్రమే చెప్పాడు. అభిమానులకు చేతులెత్తి నమస్కరించాడు. కాలర్ మాత్రం ఎగరేయలేదు. 

సినిమా రిలీజైన వెంటనే ఓసారి కాలర్ ఎగరేశాడు మహేష్. తర్వాత రీసెంట్ గా సుదర్శన్ 35ఎంఎం థియేటర్ ను సందర్శించి, అక్కడ కూడా కాలర్ ఎగరేశాడు.

ఇదే ఊపులో బెజవాడ విజయోత్సవంలో కూడా మహేష్ కాలర్ ఎగరేస్తాడని అంతా ఎదురుచూశాడు. కానీ మహేష్ మాత్రం నమస్కారాలకే పరిమితమయ్యాడు. 

తాజాగా వివాదాస్పదమైన దర్శకుల ప్రస్తావన అంశాన్ని కూడా మహేష్ పక్కనపెట్టాడు. తన పాతికేళ్ల ప్రస్థానాన్ని చెప్పే క్రమంలో అందర్నీ గుర్తుచేసుకున్న మహేష్.. ఆ లిస్ట్ లో పూరి జగన్నాధ్ పేరును చెప్పడం మరిచిపోయాడు.

అదే వరసలో సుకుమార్ పేరును కూడా మరిచిపోయాడు. తర్వాత వాటికి ఆయన వివరణలు ఇచ్చుకున్నాడు. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, తన తొలి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావును మాత్రమే గుర్తుచేసుకున్నాడు. 

ఇక సినిమా విషయానికొస్తే స్టూడెంట్ క్యారెక్టర్ పై కూడా మహేష్ కప్పదాటు వ్యవహారం కనిపించింది. మొన్నటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూల్లో తనకు స్టూడెంట్ పాత్ర చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.

బెజవాడ విజయోత్సవంలో మాత్రం స్టూడెంట్ క్యారెక్టర్ ను చాలా ఎంజాయ్ చేశానని అన్నాడు మహేష్.