cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ బాబుకి కోపమొచ్చింది!

మహేష్ బాబుకి కోపమొచ్చింది!

మీడియాలో ఫేక్ న్యూసే కాదు ఒక్కోసారి ఫ్యాక్ట్స్ కూడా హీరోలని ఇబ్బంది పెడుతుంటాయి. తాము సీక్రెట్‌గా వుంచి, ఘనంగా ప్రకటించుకుని, సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న సంగతులు ముందుగా మీడియాలో లీక్ అయిపోతే వారికి చిరాకు పుడుతుంది. అలాగే తన కొత్త సినిమా టైటిల్ బయటకు రావడం మహేష్‌బాబుకి అసహనం కలిగించింది. 

పరశురామ్ డైరెక్షన్‌లో మహేష్ చేసే చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ సూచించినపుడు మహేష్ బాగా ఎక్సయిట్ అయ్యాడట. చాలా క్యాచీగా, సినిమాపై ఆసక్తి పెంచేలా వుందని చెప్పాడట.

ఈ టైటిల్‌ని చాలా గోప్యంగా వుంచి ఘనంగా ప్రకటించాలని మహేష్ భావించాడట. అయితే ఈలోగా మీడియాకి ఈ టైటిల్ లీక్ అయిపోయింది. మహేష్ ప్రకటించేలోపే పేరు మార్మోగిపోయింది.

మీడియాకి తెలియకుండా ఎందుకు దాచలేరని, నాలుగు గోడల మధ్య, నలుగురి మధ్య జరిగే సంభాషణ బయటకు ఎలా వెళుతోందని మహేష్ తన పీ.ఆర్. టీమ్‌పై అసహనం వ్యక్తం చేసాడని వదంతులు వినిపిస్తున్నాయి.

రాంగ్ న్యూస్ వస్తే కిల్ ఫేక్‌న్యూస్ అంటూ ట్రెండ్ చేయగలరు కానీ వాస్తవాలు బయటకు వస్తే సేవ్ ఫ్యాక్ట్స్ అంటూ ట్రెండ్ చేయలేరుగా. హీరోలతో పాటు మీడియాకి కూడా వెన్న రాయడం పీఆర్ బృందాలకి తప్పనిసరి అయినపుడు ఇలాంటి విషయాలు దాచేస్తే దాగవు మరి.