cloudfront

Advertisement


Home > Movies - Movie News

క్రికెట్ స్టేడియం నుంచి 'హయ్' చెప్పిన మహేశ్!

క్రికెట్ స్టేడియం నుంచి 'హయ్' చెప్పిన మహేశ్!

కొన్ని రోజలుగా హాలిడేలో ఉన్న ప్రిన్స్ మహేశ్ బాబు ఇంగ్లండ్ నుంచి తన ఫ్యాన్స్ కు ‘హాయ్’ చెప్పాడు. ప్రపంచకప్ వీక్షణతో వినోదాన్ని పొందుతున్నాడు మహేశ్. ఈ మేరకు ది ఓవల్ స్టేడియం నుంచి మహేశ్ బాబు ఒక పిక్ ను పోస్ట్ చేశాడు. తనయుడితో కలిసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షిస్తూ దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు మహేశ్ బాబు.

‘’‘This one's for my boy... #INDvAUS @ The Oval’’ అంటూ మహేశ్ బాబు పోస్టు పెట్టాడు. ఇటీవలే మహేశ్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మహేశ్ విహారంలో ఉండగానే ఆ సినిమా ను లాంఛనంగా ప్రారంభించారు.