cloudfront

Advertisement


Home > Movies - Movie News

మురుగదాస్ కు మహేశ్ ప్రశంసలు!

మురుగదాస్ కు మహేశ్ ప్రశంసలు!

తనకు స్పైడర్ వంటి డిజాస్టర్ ను ఇచ్చినా.. మురుగదాస్ విషయంలో మహేశ్ ఏం కోపంతో ఉన్నట్టుగా లేడు. తనకే అవసరం లేకపోయినా.. మురుగదాస్ తాజా సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టాడు ప్రిన్స్. విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్” సినిమా బాగుందంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ ను అభినందిస్తూ ట్వీట్ పెట్టాడు.

ఈ ట్వీట్ పై వెంటనే రియాక్ట్ అయ్యాడు మురుగదాస్. సార్.. థ్యాంక్యూ సో మచ్.. అంటూ మహేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేసుకున్నాడు మురుగదాస్. మహేశ్ కు ఈ సినిమా నచ్చడం తనకు చాలా ఆనందమంటూ ట్వీట్ చేశాడు. అలాగే మరి కొందరు సెలబ్రిటీలు కూడా ‘సర్కార్” విషయంలో మురుగదాస్ ను అభినందిస్తూ ట్వీట్ చేస్తూ ఉన్నారు.

అయితే వారందరి ట్వీట్లలో కెళ్లా మహేశ్ ట్వీట్ మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే. మహేశ్ కెరీర్ లోనే స్పైడర్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సాధారణంగా తమకు అలాంటి ఫ్లాప్ లను ఇచ్చిన దర్శకులపై హీరోలు గరం అవుతూ ఉంటారు.

అయితే మురుగదాస్ విషయంలో మహేశ్ మాత్రం అలాంటి కోపాన్ని ఏమీ కలిగి ఉండలేదు. ఆ దర్శకుడి తాజా సినిమాను తను బాగా ఎంజాయ్ చేశానని, ఇది మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ అని ప్రశంసించాడు మహేశ్.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్