నా సినిమాలు థియేటర్ల కోసమే: మహేష్ బాబు

కరోనా/లాక్ డౌన్ వల్ల కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యాయి. ఫలానా హీరో సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ గాసిప్స్ కూడా రావడం చూస్తున్నాం. ఇలా సినిమాలు థియేటర్…

కరోనా/లాక్ డౌన్ వల్ల కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యాయి. ఫలానా హీరో సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ గాసిప్స్ కూడా రావడం చూస్తున్నాం. ఇలా సినిమాలు థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడంపై మహేష్ బాబు ఏమంటున్నాడు? మహేష్ బాబు సినిమాలు నేరుగా ఓటీటీలోకి వస్తాయా?

“థియేటర్ లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేం. ఎన్నో సినిమాల్ని మొబైల్ ఫోన్లలో కంటే బిగ్ స్క్రీన్ పైనే ఎంజాయ్ చేయగలం. నా సినిమాల విషయానికొస్తే, నా మూవీస్ అన్నీ బిగ్ స్క్రీన్ కోసమే. వెండితెరపైనే నా సినిమాల్ని చూడాలనుకుంటాను. ఓటీటీ వల్ల థియేటర్ వ్యవస్థ దెబ్బతినదు. అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది.”

బాలీవుడ్ కు సంబంధించి సరైన టైమ్ లో సరైన సినిమా చేయాలని ఎప్పుడూ అనుకునే వాడినని, ఇన్నాళ్లకు రాజమౌళి దర్శకత్వంలో ఆ సినిమా, ఆ టైమ్ వచ్చిందన్నాడు మహేష్. రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్లో, వివిధ భాషల్లో రిలీజ్ అవుతుందని స్పష్టంచేశాడు.

లాక్ డౌన్ టైమ్ లో అందర్లానే తను కూడా ఇంటికే పరిమితమైపోయానని, పెద్దగా పట్టించుకోని చిన్న చిన్న విషయాల్ని గమనించడం నేర్చుకున్నానని తెలిపాడు. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ లో బాగా ఈత కొట్టడం నేర్చుకున్నానని అన్నాడు.