cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహేష్ "సుదర్శన్" మధురానుభూతులు

మహేష్

తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లను సందర్శించడం అనే పద్ధతిని ఎప్పుడో వదిలేశాడు మహేష్. ఒకానొక టైమ్ లో మహేష్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు తయారైంది పరిస్థితి. అలా థియేటర్లకు వెళ్లడం మానేసిన మహేష్, ఎట్టకేలకు తిరిగి ఆ పద్ధతిని ప్రారంభించాడు.

తన 25వ సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ లోని సుదర్శన్-35ఎంఎం థియేటర్ ను సందర్శించాడు. ఈ సందర్భంగా 'సుదర్శన్'తో తనుకున్న అనుభూతుల్ని పంచుకున్నాడు మహేష్. తనకు ఈ థియేటర్ ఎందుకు అంత ప్రత్యేకమో చెప్పుకొచ్చాడు.

"మురారి అనే సినిమాను ఇదే థియేటర్లో నేను చూశాను. సినిమా అయిన తర్వాత నాన్న నా భుజంపై చేయి వేశారు. ఆ రోజు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఏఎంబీ అనే మల్టీప్లెక్స్ ఉంది నాకు. ఆ థియేటర్ ఉన్నప్పటికీ ఈ సుదర్శన్-35ఎంఎం హాల్ నే నా సొంత థియేటర్ అని ఫీల్ అవుతుంటాను."

మహేష్ నటించిన చాలా సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. అతడి కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు కూడా ఇక్కడ బాగా వసూళ్లు సాధించిన దాఖలాలున్నాయి. అందుకే మహేష్ కు ఈ థియేటర్ అంటే ప్రత్యేకమైన అభిమానం.

తన 25 సినిమాల కెరీర్ లో సుదర్శన్ థియేటర్ ను సందర్శించిన రోజును ఎప్పటికీ మరిచిపోలేనని ప్రకటించాడు మహేష్. ఈ సందర్భంగా అభిమానుల కోసం మరోసారి కాలర్ ఎగరేశాడు. థియేటర్ల సందర్శన, బెజవాడ సక్సెస్ మీట్ కోసం మహేష్ తన ఫారిన్ ట్రిప్ ను రద్దు చేసుకున్నాడు. 

సుదర్శన్ థియేటర్ ను సందర్శించిన మహర్షి టీమ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!