cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహేష్‌ స్ట్రాటజీ అదుర్స్‌

మహేష్‌ స్ట్రాటజీ అదుర్స్‌

స్టార్‌ హీరోలంటే స్టార్‌ డైరెక్టర్లతో మాత్రమే చేయాలనే పద్ధతి చాలా కాలంగా టాలీవుడ్‌లో కొనసాగుతోంది. ప్రతిభావంతులైన యువ దర్శకులు కనిపిస్తున్నా కానీ స్టార్‌డమ్‌ వున్న దర్శకులయితే సేఫ్‌ అనే అనుకునే వారు. కానీ త్రివిక్రమ్‌ నుంచి అజ్ఞాతవాసి, బోయపాటి శ్రీను నుంచి వినయ విధేయరామ, శ్రీనువైట్ల నుంచి ఆగడు, మురుగదాస్‌ నుంచి స్పైడర్‌ తదితర ఫలితాలు చూసిన తర్వాత స్టార్‌డమ్‌ అనేది అలంకారమే తప్ప బలంకాదని తేలిపోయింది.

స్టార్‌ దర్శకులతో చేసినపుడు కూడా రిస్క్‌ ఫ్యాక్టర్‌ అంతే వున్నపుడు ఆ రిస్క్‌ ఏదో యువకులతో చేస్తే తమని తాము ప్రూవ్‌ చేసుకోవాలనే కసితో ఎక్కువ కష్టపడతారు కదా? మిగతా హీరోలు ఇలా ఆలోచిస్తున్నా, లేకున్నా మహేష్‌ మాత్రం ఈ దిశగా ఆలోచించి ఇప్పటికే ఆచరణలో పెట్టేసాడు. అనిల్‌ రావిపూడితో తదుపరి చిత్రాన్ని చేస్తోన్న మహేష్‌ మరో ఇద్దరు యువ దర్శకులు సందీప్‌ రెడ్డి వంగా, పరశురామ్‌తో కూడా స్టోరీ సిట్టింగ్స్‌ వేస్తున్నాడు.

ఒక్కసారి మహేష్‌ దృష్టిలో పడగలిగే సినిమా చేస్తే వెంటనే సూపర్‌స్టార్‌నుంచి పిలుపు వస్తుందని యువ దర్శకులు నమ్మడమే కాకుండా అతని కోసం కథలు కూడా రాసేసుకుంటున్నారు. మిగిలిన స్టార్‌ హీరోలలో ప్రభాస్‌ ఒక్కడే ఒక్క సినిమా అనుభవం వున్న సుజీత్‌, రాధాకృష్ణతో సినిమాలు చేస్తున్నాడిపుడు.