Advertisement


Home > Movies - Movie News
మహేష్‌ టైమ్‌ స్టార్ట్‌ అయింది

మహేష్‌బాబుకి ఫ్లాపులేం కొత్త కాదు. అయితే బ్రహ్మూత్సవం, స్పైడర్‌ ఫలితాలు మాత్రం ఇటు మహేష్‌నే కాకుండా అటు ఫాన్స్‌ని కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. శ్రీమంతుడుతో బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మహేష్‌ అటుపై అదే పట్టు కొనసాగించినట్టయితే నంబర్‌వన్‌ హీరోగా అవతరించేవాడు.

కానీ ఈ రెండు ఘోర పరాజయాలు మహేష్‌ని డిఫెన్స్‌లోకి నెట్టేసాయి. తన పోటీదారులైన హీరోలు నిలకడ ప్రదర్శిస్తోన్న టైమ్‌లో మహేష్‌ పట్టు తప్పాడు. స్పైడర్‌ ఫ్లాప్‌ తర్వాత మహేష్‌ ఒక్కసారి పాజ్‌ తీసుకుని తన కెరీర్‌పై ఒకసారి అధ్యయనం చేసాడు. తప్పెక్కడ జరుగుతుందనేది తరచి చూసుకున్నాడు. డిజిటల్ టీమ్‌ని మార్చేసాడు. 'భరత్‌ అనే నేను' స్క్రిప్టులోను మార్పులు చేయించాడు.

ఒక పక్కా ప్రణాళికతో ప్రమోట్‌ చేస్తోన్న 'భరత్‌ అనే నేను' ఇప్పుడు వేసవిలో రాబోతోన్న అన్ని సినిమాల కంటే చాలా క్రేజీగా కనిపిస్తోంది. ఈ చిత్రంపై వున్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. కోట్ల కొద్దీ వ్యూస్‌ సాధించిన భరత్‌ అనే నేను టీజర్‌ సినిమాపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసింది.

మహేష్‌ టైమ్‌ మళ్లీ స్టార్ట్‌ అయిందని దీనికి వస్తోన్న స్పందన తెలియజేస్తోంది. ఈసారి పట్టు సాధిస్తే ఇక మళ్లీ గ్రిప్‌ కోల్పోకుండా తన తదుపరి చిత్రాలపై మహేష్‌ చాలా కేర్‌ తీసుకుంటున్నాడు.