ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తల్లో వినిపించిన వార్త మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించే. ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం కావడంతో, తివిక్రమ్ వేరే సినిమాను మహేష్ తో చేస్తారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయం ఎన్టీఆర్ ఏమంటారో అనే మీమాంసలు కూడా వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకు ప్రస్తుతానికి కామా పెట్టేసినట్లు తెలుస్తోంది.
మహేష్ తో సినిమా అంటే ఎన్టీఆర్ ఏమంటారో అని అడగడానికే వెనకడుగు వేసి, టోటల్ గా ప్రాజెక్టును ప్రస్తుతానికి ఇరు వర్గాలు కలిసి అబేయన్స్ లో పెట్టేసినట్లు తెలుస్తోంది.
మహేష్ కూడా తనకు ఇప్పట్లో సర్కారువారి పాట చేయడం కుదరదు అని, డిసెంబర్ లేదా జనవరి నుంచి కానీ ఆ సినిమా స్టార్ట్ చేయడం సాధ్యం కాదని, అది ఓ షెడ్యూలు చేసి వస్తే కానీ త్రివిక్రమ్ సినిమా చేయడం కుదరని ఆలోచించి, దానిని తరువాత ప్రాజెక్టు కింద పెట్టుకోవాలని డిసైడ్ అయినట్ల బోగట్టా.
నిజానికి మహేష్ తరువాత సినిమా రాజమౌళితో వుంది. ఆ లెక్కలు అన్నీ తరువాత చూసుకుంటారు. మొత్తానికి ఇప్పట్లో అయితే త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లేనట్లే అనుకోవాలి.