cloudfront

Advertisement


Home > Movies - Movie News

మాజీ హీరోయిన్ ఫిట్‌నెస్, కుర్రాళ్లకు కిక్!

మాజీ హీరోయిన్ ఫిట్‌నెస్, కుర్రాళ్లకు కిక్!

పెళ్లైన వాళ్లను ఆంటీలంటూ వెటకారం ఆడుతూ ఉంటుంది కుర్రకారు. మాజీ హీరోయిన్ల విషయంలో కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ఆమె వయసు నిజంగానే ఆంటీ అనిపించుకోవడానికి తగినదే. 44 యేళ్లు మరి. ఈ వయసులో కూడా మలైకా అరోరా మెయింటెయిన్ చేసే ఫిజిక్.. ఆమెను ఆంటీ అంటే అది పెద్ద దోషమే అనిపించేలా ఉంటుంది.

తన ఫిట్‌నెస్ ఏ స్థాయిదో తన అందాల ప్రదర్శనతోనే కాదు.. ఈ పోజుతో కూడా చాటి చెబుతోంది మలైకా. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మలైకా ఒక స్టన్నింగ్ పోజును పోస్టు చేసింది. తనను అంటీ అంటూ ఎవరైనా వెటకారం ఆడదలుస్తున్నారా? అన్నట్టుగా ఉంది ఈ పోజు. తనను ఆంటీ అనే ముందు, తన వయసు గురించి మాట్లాడే ముందు తన ఫిట్‌నెస్ చూసి.. మాట్లాడాలన్నట్టుగా మలైకా అదరగొట్టింది.

44 యేళ్ల వయసులో మలైకా చూపుతున్న ఫిట్‌నెస్ 24 యేళ్ల వయసులో కూడా చాలా మంది కుర్రకారుకు సాధ్యమయ్యే పని కాదని కచ్చితంగా చెప్పవచ్చు. ఎంతైనా మలైకా ఎవరిగ్రీన్!