యంగ్ హీరో రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో రెడీ అవుతున్న రెండో సినిమనా పవర్ ప్లే. ఇప్పటి వరకు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లు అందించిన కొండా విజయకుమార్ తొలిసారి థ్రిల్లర్ సినిమా అందించబోతున్నారు. రాజ్ తరుణ్ కూ ఇలాంటి సినిమా చేయడం ఇదే తొలిసారి. వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండగా ఆస్ట్రేలియాలో సథరన్ స్టార్ ఇంటర్నేషనల్, మిడిల్ ఈస్ట్‌లో మను రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవేష్ మాట్లాడుతూ – “ రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్లో డిఫరెంట్ జోనర్లో వస్తోన్న చిత్రమిది. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో వరంగల్ శ్రీను 'కార్తికేయ ఎగ్జిబిటర్స్' ద్వారా గ్రాండ్‌గా విడుదలవుతుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాలపర్తి అనంత్ సాయి మాట్లాడుతూ – “ పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే క్రమంలో వున్న `పవర్ ప్లే` తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది“ అన్నారు.