ప్రస్తుతం చేతిలో వున్నవి కాకుండా మరో రెండు సినిమాల మీద మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్ అయిపోయారు. తనకు, చరణ్ కు వున్న ఆబ్లిగేషన్లు, కమిట్ మెంట్లు అన్నీ ఒక్కోటీ కట్ చేసుకుంటూ వస్తున్నారు.
నిర్మాత కేఎస్ రామారావును ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సినిమాలో భాగస్వామిగా చేర్చారు. తన సన్నిహిత మిత్రుడు జికె మోహన్ ను మైత్రీ మూవీస్ – బాబీ సినిమాలో యాభై శాతం భాగస్వామిగా చేర్చారు.
యువి అధినేతల్లో ఒకరైనా విక్రమ్ రెడ్డి (విక్కీ) కోసం ఓ సినిమా చేయాలన్నది రామ్ చరణ్ కోరిక. అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాల తరువాత సినిమా యువి కే చేయబోతున్నారు.
దర్శకుడు మారుతి ఓ లైన్ ఓకె చేయించుకుని, కథ రెడీ చేస్తున్నారు. అది ఓకె అయితే మారుతినే దర్శకుడు. కాదంటే అప్పుడు చూడాలి. నిర్మాత మాత్రం యువి నే.
ఆ తరవాత డివివి దానయ్య కు ఓ సినిమా చేస్తారు. ఇది కూడా ఎప్పుడో మాట ఇచ్చిందే. దీనికి ఇంకా డైరక్టర్ ఫైనల్ కాలేదు. ఇవి పూర్తయిన తరువాతే మరెవరి సినిమా అయినా.