Advertisement

Advertisement


Home > Movies - Movie News

మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు

మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు

సమ్ థింగ్ స్పెషల్ అనేది లేకపోతే సినిమాకు కలర్ రాదు. అందుకే ఏదో ఒకటి చేయాలి. మారుతి-గోపీచంద్-రాశీఖన్నా-బన్నీవాస్ కలయికలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. 

ఈ సినిమాలో రాశీఖన్నా కాకుండా మరో ముగ్గురు హీరోయిన్లు వున్నారట. అలా అని ఫుల్ లెంగ్త్ కాదు. స్పెషల్ అట్రాక్షన్ కూడా కాదు. ఎవరి పాత్రలు వాళ్లకి వున్నాయి.

అదితి గౌతమ్…చిత్రా శుక్లా…వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ ముగ్గురు హీరోయిన్ల సినిమాలో అక్కడక్కడ తళక్కున మెరిస్తారట. వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమా క్లయిమాక్స్ ముందు సీన్ లోకి ఎంటర్ అవుతుంది. అదితి గౌతమ్ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తూ వుంటుంది. చిత్రా శుక్లా ఓ చిన్న పాత్రలో వుంటుంది.

సినిమాకు యంగ్ క్యారెక్టర్ యాక్టర్లు చేయాల్సిన పాత్రలకు కాస్త క్రేజ్ వున్న లేదా నోటెడ్ వున్న హీరోయిన్లను తీసుకుంటే ఆ లుక్ వేరుగా వుంటుంది. అది మారుతికి బాగా తెలుసు. అందుకే ఈ చమక్కు అన్నమాట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?