మాట వినని ‘మెగా తనయ’

తండ్రితో ఓ సినిమా నిర్మించాలన్నది మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల కోరిక. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తండ్రి మెగాస్టార్ నే ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారు. Advertisement తను హీరోగా…

తండ్రితో ఓ సినిమా నిర్మించాలన్నది మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల కోరిక. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తండ్రి మెగాస్టార్ నే ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారు.

తను హీరోగా మూడు హిట్ సినిమాలు అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా ఓ సినిమా ప్లాన్ చేసారు. దీనికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ తీసిన మూడు ఫ్యామిలీ బ్యాక్ గ్రవుండ్ సినిమాలు హిట్ లే కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనా వుంది.

ఇలాంటి నేపథ్యంలో ఓ బ్యానర్ ఈ సినిమాను నిర్మించడానికి  ముందుకు వచ్చింది. సినిమా నిర్మాణ వ్యయం మొత్తం తాము భరిస్తామని, లాభంలో సగం వాటా ఇస్తే చాలు అని, సుస్మిత బ్యానర్ తో పాటు, తమ బ్యానర్ కూడా యాడ్ చేయమని ప్రపోజ్ చేసారు. ఇది సహజంగానే మెగాస్టార్ కు నచ్చింది. అన్ని విధాలా బాగుంటుందని ఆయన భావించారు. అందుకే ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కానీ మెగా తనయ మాత్రం తాను సోలోగానే ఈ సినిమాను నిర్మిస్తా అని, ఆ క్రెడిట్ తనకు కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. లాభం, నష్టం, వాటా అన్నది కాదు అని, తన తండ్రితో తాను సినిమా నిర్మించడం అన్నదే పాయింట్ అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ప్రతిపాదన ఆగింది. మెగాస్టార్ మెల్లగా తన కుమార్తె ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు భోగట్టా.