Advertisement

Advertisement


Home > Movies - Movie News

మట్టి కుస్తీ.. పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా కాదు

మట్టి కుస్తీ.. పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా కాదు

ఈమధ్య హీరోలు, దర్శకులు ఎవ్వరూ కథ దాచుకోవడం లేదు. తమ సినిమాలో కథ ఇలా ఉంటుంది, మీరు ఈ అంచనాలతో రావాలంటూ ముందే ప్రేక్షకులకు చెప్పేస్తున్నారు. అలా వాళ్ల మైండ్ సెట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇలా చేయడం కూడా ఒకందుకు మంచిదే. సినిమాపై లేనిపోని అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వస్తారు జనం.

మట్టీ కుస్తీ విషయంలో కూడా ఇలాంటి క్లారిటీనే ఇచ్చాడు హీరో విష్ణు విశాల్. ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా అని అంతా అనుకుంటున్నారు. అయితే హీరో మాత్రం అలాంటి అంచనాలు పెట్టుకోవద్దంటున్నాడు. సినిమాలో కేవలం ఓ 20-30 నిమిషాలు మాత్రమే స్పోర్ట్స్ ఉంటాయని, మిగతాదంతా ఫ్యామిలీ డ్రామా అని స్పష్టం చేశాడు.

"మట్టి కుస్తీ భార్య భర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా ఉంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ ఉంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యభర్తలకు కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. మట్టికుస్తీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. స్పోర్ట్స్ కూడా లైట్ హార్టెడ్ గా ఉంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. మట్టి కుస్తీ నా కెరీర్ లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్."

ఇలా మట్టి కుస్తీ సినిమాపై ప్రేక్షకుల మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేశాడు విష్ణు విశాల్. ఇందులో నటించడంతో పాటు హీరో రవితేజతో కలిసి ఈ సినిమాను నిర్మించాడు విష్ణు విశాల్. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?