cloudfront

Advertisement


Home > Movies - Movie News

మీట్ మిస్టర్ అర్జున్

మీట్ మిస్టర్ అర్జున్

క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలు అన్నింటికీ దాదాపు ఒకటే పాట్రన్ వుంటుంది. మాంచి క్రీడాకారుడు కావాలనే కోరిక, సహకరించిన పరిస్థితులు, వచ్చే అడ్డంకులు, వాటిని అధిగమించిన వైనం, చివరకు సాధించే విజయం. చాలా సినిమాలు ఇంతే. కాబోతే డీల్ చేసే విధానం తేడా వుంటుంది. ఆ తేడానే సినిమాను కొత్తగా చూపించే ప్రయత్నం.

త్వరలో రాబోతోంది నాని హీరోగా జెర్సీ సినిమా. మళ్లీ రావా సినిమాతో పయనం మొదలుపెట్టిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఓ క్రికెటర్ కథ అని ఇప్పటికే విషయం బయటకు వచ్చింది. ఈ రోజు విడుదల చేసిన ట్రయిలర్ తో ఆ సంగతి ఖరారయింది.

ముఫై ఏళ్లు దాటేసిన వ్యక్తి క్రికెట్ కావాలని కన్న కలలు నేపథ్యంలో సినిమా వుండబోతోందని టీజర్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. టీజర్ కట్ పెర్ ఫెక్ట్ కా వుంది. సినిమా జోనర్, లైన్ అన్నీ క్లియర్ గా వివరించేసారు ఏమాత్రం దాచకుండా.

ఓ స్పోర్ట్స్ సినిమాకు సమకూరాల్సిన సినిమాటోగ్రఫీ టీజర్ లో కనిపించింది. ప్రతి ఫ్రేమ్ బాగుంది. అనిరుధ్ ఆర్ ఆర్ డిఫరెంట్ గా వుండడమే కాక, టజర్ కు ఓ ప్రత్యేకత తెచ్చింది. ఓవరాల్ గా ఓ డిఫరెంట్ సినిమాను చూడబోతున్నామన్న ఫీల్ ను టీజర్ కలిగించింది.