cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సింగ‌ర్ పెళ్లిపై మెగా బ్ర‌ద‌ర్ స్పంద‌న ఏంటంటే...

సింగ‌ర్ పెళ్లిపై మెగా బ్ర‌ద‌ర్ స్పంద‌న ఏంటంటే...

ప్ర‌ముఖ గాయ‌ని సునీత రెండో వివాహంపై ఇటీవ‌ల కొంద‌రు విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. పిల్ల‌లు పెద్ద‌వాళ్లైన త‌రుణంలో సునీత పెళ్లి చేసుకోవ‌డంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు త‌ప్పు ప‌ట్ట‌డాన్ని సెల‌బ్రిటీలు తిప్పికొడుతున్నారు. 

ఇటీవ‌ల మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీర‌ప‌నేనిని సునీత వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ఎదిగిన పెళ్లిళ్ల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లిచేసుకోవ‌డంపై త‌ప్పు ప‌డుతున్న నెటిజ‌న్ల‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. 

అలాగే సునీత‌, రామ్ జంట‌ను ఆద‌ర్శమైంద‌ని అభివ‌ర్ణించారు.  సునీత‌, రామ్ జంట‌కు నాగ‌బాబు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో పాటు మ‌ద్ద‌తుగా నిలుస్తూ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఆ ట్వీట్ ఎలా సాగిందంటే...

‘సంతోషం అనేది పుట్టుకతో రాదు. దాన్ని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలి’ అని కోరుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. 

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

 


×