మెగాస్టార్ నే టాప్ స్టార్

ఇది కొత్త విషయమా ఇధేమన్నా…మెగాస్టార్ ఎప్పుడూ టాప్ స్టార్ నే కదా? అనుకోవచ్చు. ఇక్కడ విషయం అది కాదు. చకచకా సినిమాలు చేయడంలో ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలోనే అందరికన్నా ముందున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు…

ఇది కొత్త విషయమా ఇధేమన్నా…మెగాస్టార్ ఎప్పుడూ టాప్ స్టార్ నే కదా? అనుకోవచ్చు. ఇక్కడ విషయం అది కాదు. చకచకా సినిమాలు చేయడంలో ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలోనే అందరికన్నా ముందున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. మరో మూడు సినిమాలు ప్లాన్ చేసి వుంచుకున్నారు.

2022లోనే నాలుగు సినిమాలు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. 2023లో మరో మూడు సినిమాలు వుండేలా చూసుకుంటున్నారు. వీటిని ఇప్పటికే డిస్కషన్ లోకి తీసుకున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాల‌ను 2022 లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. తప్పితే ఒక్క సినిమాను 2023 సంక్రాంతికి రిజర్వ్ చేస్తారు. 

ఇప్పటికే 2022 లో విడుదల చేయబోయే సినిమాలకు టెంటటివ్ గా డేట్ లు కూడా డిసైడ్ చేసుకున్నట్లు బోగట్టా. మరోపక్కన యువి/మారుతి సినిమా ప్లానింగ్ లో వుంది. కథ పూర్తయితే అది పట్టాలు ఎక్కడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు మరో సినిమా కూడా వినిపిస్తోంది. 

వెంకీ కుడుముల/డివివి దానయ్య కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ లను ట్రయ్ చేసిన వెంకీ కుడుముల కు చిరంజీవి సినిమా సెట్ అయినట్లు తెలుస్తోంది. 

ఈ రెండూ కాక విష్ణూ ఇందూరి నిర్మాతగా విజేత-2 సినిమా చేయాలనే ఆలోచన వుంది. కథ రెడీగా వుంది. దర్శకుడు ఫిక్స్ కావాల్సి వుంది. 

అంటే రెడీ అయిపోయిన ఆచార్య, రెడీ అవుతున్న మూడు సినిమాలు, ఇవి కాక మరో మూడు సినిమాలు. అంటే టోటల్ గా 7 సినిమాలు అన్నమాట. ఇలా ఏ హీరో కూడా ప్లాన్ చేయడం లేదు. ఒకప్పుడు అల్లరి నరేష్ ఇలా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వదిలేవాడు. ఇన్నాళ్లకు మళ్లీ మెగాస్టార్ ఆ స్పీడ్ లో వున్నారు.

అయితే ఇక్కడే మెగాస్టార్ మరో జాగ్రత్త కూడా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేవలం తను సోలోగా సినిమా చేయకుండా ఎవరో ఒక యంగ్ హీరో ప్యాడింగ్ వుండేలా చూసుకుంటున్నారు. ఆచార్యలో రామ్ చరణ్, గాడ్ ఫాదర్ లో సల్మాన్, వాల్తేర్ వీరయ్య లో రవితేజ (ఫిక్స్ కావాల్సి వుంది), విష్ణు ఇందూరి సినిమాలో కూడా యంగ్ హీరో ఇలా అన్నమాట.