Advertisement


Home > Movies - Movie News
యాక్షన్ ఎపిసోడ్స్ తోనే ‘సైరా’ షూట్ ప్రారంభం

డిసెంబరు 6వ తేదీనుంచి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హై మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఆగస్టు 22న ఓపెనింగ్ జరిగిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ కు సంబంధించిన కసరత్తులు చేస్తూనే ఉంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు.

సెట్స్ మీదకు రావడమే.. ప్రారంభంలోనే ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ తోనే ప్రారంభించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫైట్ మాస్టర్లు... ఓపెనింగ్ షెడ్యూల్ లో కంపోజ్ చేయాల్సిన యాక్షన్ సీన్లను రూపొందించడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

మెగాస్టార్ చాలా ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ చిత్రంలో వేర్వేరు భాషల చిత్ర పరిశ్రమల నుంచి అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి.. కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే ఇప్పటికి ఒక హీరోయిన్ గా నయనతార ఫైనలైజ్ కాగా మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలుసాగుతున్నాయి. ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రంలో నటిస్తోంది.

రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి 150 సినిమాల కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. ఒక రకంగా చూస్తే.. బాహుబలి తర్వాత తెలుగు పరిశ్రమలోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇన్ని రకాల స్పెషాలిటీలను పోగు చేసుకున్న చిరంజీవి ‘సైరా’ డిసెంబరు 6నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళుతుండడం.. కొన్నినెలలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు శుభవార్తే.