cloudfront

Advertisement


Home > Movies - Movie News

నర్తనశాల హీరోయిన్ ఫిక్స్

నర్తనశాల హీరోయిన్ ఫిక్స్

బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులొచ్చినా మెహ్రీన్ హవా తగ్గలేదు. ఆమెకు టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలో హీరోయిన్ గా ఎంపికైన ఈ బ్యూటీ, తాజాగా మరో అవకాశం కొట్టేసింది. నాగశౌర్య సరసన హీరోయిన్ గా ఎంపికైంది.

ఛలో సక్సెస్ తో ఊపుమీదున్న నాగశౌర్య, మళ్లీ తన సొంత బ్యానర్ లోనే నర్తనశాల సినిమా స్టార్ట్ చేశాడు. ఈసారి చక్రవర్తి అనే మరో కొత్త దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను తీసుకున్నారు. నాగశౌర్య-మెహ్రీన్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. ఏప్రిల్ 12నుంచి ఈ సినిమా సెట్స్ కి రానుంది.

కేరాఫ్ సూర్య, జవాన్ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మెహ్రీన్ కు ఇక అవకాశాలు కష్టమని అంతా అనుకున్నారు. స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోకపోయినా.. మీడియం రేంజ్ హీరోలు మాత్రం ఆమెకు అవకాశాలిస్తూనే ఉన్నారు. విజయ్ దేవరకొండ, నాగశౌర్య సినిమాలతో పాటు త్వరలోనే మరో 2 ప్రాజెక్టులు కూడా ఎనౌన్స్ చేయబోతోంది ఈ బ్యూటీ.