Advertisement

Advertisement


Home > Movies - Movie News

మినీ కథకు హెవీ ప్రయిస్

మినీ కథకు హెవీ ప్రయిస్

యువి నిర్మాణ సంస్థ చిన్న సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టింది. దర్శకుడు మేర్లపాక మురళి సూపర్ విజన్ లో నిర్మించిన సినిమా సినిమా ఏక్ మినీ కథ ను ఓటిటికి అమ్మేసారు. 

ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం అన్న క్లారిటీ రావడంతో ఓటిటికి విక్రయించేసారు. తొమ్మిది కోట్లకు కాస్త అటు ఇటుగా అమ్మేసారని తెలుస్తోంది.

సంతోష్ శోభన్ హీరోగా తీసిన ఈ సినిమా చిన్న సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తయారైంది. కాస్త అడల్డ్ కామెడీ టచ్ వున్న సబ్జెక్ట్ ఇది. దీన్ని అమెజాన్ ఒరిజినల్స్ కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇంక థియేటర్ లోకి రాకపోవచ్చు.

ఎంత లేదనా అయిదు కోట్లకు పైగానే యువికి లాభం వుంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే నెలాఖరులో ఈ సినిమా ఓటిటిలో విడుదలవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?