Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో క్రికెట్ బయోపిక్!

మరో క్రికెట్ బయోపిక్!

ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ వచ్చింది. సచిన్ టెండూల్కర్ కు సంబంధించి బయోపిక్ లాంటిదే ఒకటి వచ్చింది. అది డాక్యుమెంటరీ తరహాలో రూపొందింది. ఇక ప్రస్తుతం మేకింగ్ దశలో 1983 ఉంది. ఆ సంవత్సరంలో జరిగిన క్రికెట్ ప్రపంచకప్ లో కపిల్ డెవిల్స్ ఘన విజయం గురించి ఆ సినిమా రూపొందుతూ ఉంది. అందులో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా కనిపిస్తూ ఉన్నాడు.

ఇంకా అనేక మంది ప్రముఖ నటీనటులు ఆ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఆ సంగతలా ఉంటే.. మరో క్రికెట్ బయోపిక్ ప్రకటన వచ్చింది. ఇది ఉమెన్ క్రికెటర్ బయోపిక్. భారత క్రికెట్ జట్టుకు చాలా కాలంగా సేవలందిస్తున్న మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. ఫిమేల్ క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డులను సాధించింది మిథాలీ. 

ఈ క్రమంలో ఆమె బయోపిక్ రూపొందుతూ ఉంది. మిథాలీ పాత్రలో తాప్సీ పన్ను నటిస్తూ ఉంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది కూడా. తన సోషల్ మీడియా ఖాతాలో తాప్సీ ఈ విషయాన్ని పోస్టు చేసింది. విమెన్ సెంట్రిక్ ఆ వరసగా నటిస్తూ ఉంది తాప్సీ. ఈ క్రమంలో మిథాలీ బయోపిక్ కూడా ఆమెకే దక్కినట్టుగా ఉంది. ఇక సానియా, సైనా తదితరుల బయోపిక్స్ కూడా తెరకెక్కడానికి క్యూలో ఉన్న విషయం తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?