cloudfront

Advertisement


Home > Movies - Movie News

సెప్టెంబర్ మాసం.. టాలీవుడ్ కొత్త ఆశల కాలం

సెప్టెంబర్ మాసం.. టాలీవుడ్ కొత్త ఆశల కాలం

గీతగోవిందం మేనియాతో ఆగస్ట్ నెల ముగిసింది. సరికొత్త ఆశలతో సెప్టెంబర్ మొదలైంది. ఈ నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులున్నాయి. మరీ ముఖ్యంగా కచ్చితంగా సక్సెస్ కావాల్సిన సినిమాలున్నాయి. అవి హిట్ అయితేనే వాళ్ల ఆశలు చిగురిస్తాయి. అందుకే ఈ నెలపై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ప్రతివారం ఓ సినిమా ఆయా నటులకు కీలకంగా మారబోతోంది.

ఈనెల మొదటివారంలో (ఈ వీకెండ్) సిల్లీ ఫెలోస్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. దీనిపై ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు హీరోలు ఆశలుపెట్టుకున్నారు. వాళ్లే సునీల్, అల్లరినరేష్. సరైన హిట్ లేక తెగ ఇబ్బందిపడుతున్న ఈ హీరోలకు సిల్లీ ఫెలోస్ విజయం చాలా కీలకం. ఇది హిట్ అయితేనే వీళ్ల ఆశలు చిగురిస్తాయి.

ఇదేవారం కేరాఫ్ కంచరపాలెం, ఈమాయ పేరేమిటో సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం హిట్ అయితే రానాకు దండిగా డబ్బులొస్తాయనే విషయాన్ని పక్కనపెడితే, ఇది సక్సెస్ అయితే టాలెంట్ ఉన్న చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. ఇక ఇదేవారంలో విడుదలవుతున్న ఈమాయ పేరేమిటో సినిమాతో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాపై ఇతడు చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈనెల రెండోవారం కూడా రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒకటి శైలజారెడ్డి అల్లుడు. తన కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను చెప్పుకొస్తున్నాడు నాగచైతన్య. లాస్ట్ ఇయర్ ఓ హిట్, ఓ డిజాస్టర్ ఇచ్చిన ఈ హీరో, శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆశపడుతున్నాడు.

ఈ సినిమాతో పాటు సమంత నటించిన యూటర్న్ కూడా థియేటర్లలోకి వస్తోంది. హీరోయిన్ రోల్స్ నుంచి సీరియస్ సబ్జెక్ట్స్ వైపు టర్న్ అవ్వాలనుకుంటున్న సమంత, యూటర్న్ పై భారీగా ఆశలుపెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేస్తుంది. లేదంటే రెగ్యులర్ హీరోయిన్ గానే కొనసాగాల్సి వస్తుంది.

సెప్టెంబర్ నెలపై భారీగా ఆశలు పెట్టుకున్న మరో హీరో సుధీర్ బాబు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గా మారి ఇతడు నిర్మించిన నన్ను దోచుకుందువటే సినిమా ఈ నెలలోనే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా హిట్ అయితే నిర్మాతగా సుధీర్ బాబుకు బూస్టప్ దొరుకుతుంది. లేదంటే నిరాశ తప్పదు.

నాని, నాగార్జున నటించిన దేవదాస్ కూడా ఈనెలలోనే థియేటర్లలోకి వస్తోంది. అటు నాని, ఇటు నాగ్ ఇద్దరూ ఫ్లాపులిచ్చారు. దేవదాస్ హిట్ అయితే ఇద్దరికీ హిట్ వచ్చినట్టే. అదే వీళ్ల ఆశ కూడా. ఇలా చాలామంది హీరోల ఆశలను మోసుకొస్తోంది సెప్టెంబర్ మాసం.