Advertisement

Advertisement


Home > Movies - Movie News

మూడ్నెల్ల క్రితం ఎన్టీఆర్ ఇంటర్వూ

మూడ్నెల్ల క్రితం ఎన్టీఆర్ ఇంటర్వూ

ఉన్నట్లుండి ఉరుములేని పిడుగులా ఎన్టీఆర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ అంటూ ఓ హాలీవుడ్ వెబ్ సైట్ లింక్ ను ఈ రోజు ట్విట్టర్ లో హల్ చల్ చేసారు. 

నిజానికి ఈ ఇంటర్వ్యూలో కొత్త విషయాలు ఏవీ లేవు. తెలుగు సైట్లు అన్నీ ఎప్పటి నుంచో రాసుకుంటూ వస్తున్నవే. ఇంతకీ ఇప్పుడీ ఇంటర్వ్యూ ఏమిటి? హడావుడి ఏమిటి? అని ఆరా తీస్తే...

ఆర్ఆర్ఆర్ కు ప్రచారం కోసం దర్శకుడు రాజమౌళి కొన్ని పీఆర్ ఏజెన్సీలతో డీల్ కుదుర్చుకున్నారని బోగట్టా. అందులో బాగంగానేనే ఆయన ఈ వెబ్ సైట్ తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ముందుగా ప్లాన్ చేసారు. 

వెబ్ ఆప్లికేషన్ ద్వారా ఈ ఇంటర్వ్యూ మూడు నెలల కిందట జరిగింది. దానిని ఇప్పుడు ఆ వెబ్ సైట్ ప్రచురించింది. వాళ్ల పద్దతే అంత. అయితే ఈ లోగా పరిస్థితులు మారాయి. 

అప్పుడు ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పారు. కానీ ఇప్పుడు అది లేదు. దాంతో మెయిల్ ద్వారా కొన్ని అప్ డేట్ లను ఎన్టీఆర్ టీమ్ ఆ వెబ్ సైట్ కు పంపి, ఇంటర్వ్యూలో కరెక్షన్ లు చేయించారు. ఆ విధంగా జరిగింది. అదీ విషయం.

ఇదే కొవలో రాజమౌళి మరి కొన్ని ఇంటర్వ్యూల ప్లాన్ చేయించారని తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?