Advertisement

Advertisement


Home > Movies - Movie News

తండ్రీ కొడుకుల కాంబినేష‌న్ లో సినిమా!

తండ్రీ కొడుకుల కాంబినేష‌న్ లో సినిమా!

ద‌క్షిణాదిన బోలెడంత మంది స్టార్ హీరోలు, వారి త‌న‌యులూ హీరోలే! ద‌క్షిణాదిన అనే కాదు, భార‌తీయ సినిమాలో బోలెడంత మంది సినీ వార‌సులు హీరోల‌య్యారు. తండ్రులూ హీరోలే, కొడుకులూ హీరోలే కావ‌డంతో వారి కాంబినేష‌న్ల‌లో బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. ఎన్టీఆర్- బాల‌కృష్ణ‌, నాగేశ్వ‌ర‌రావు- నాగార్జున‌తో మొద‌లుకుని.. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు త‌మ త‌న‌యుల సినిమాల్లో క‌నిపిస్తూ ఉన్నారు. తండ్రీకొడుకుల కాంబినేష‌న్ల‌లో అనేక సినిమాలు వ‌చ్చాయి. ఇద్ద‌రివీ ఫుల్ లెంగ్త్ రోల్స్ ఉండే సినిమాలూ ఉన్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో సినిమా అలాంటిది రాబోతోంద‌ట‌.

ఈ సారి త‌మిళం నుంచి. త‌మిళంలో సీనియ‌ర్ హీరో విక్ర‌మ్, ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ కాంబోలో ఒక సినిమా రూపొంద‌నుంద‌ట‌. ఇటీవ‌లే అర్జున్ రెడ్డి రీమేక్ తో విక్ర‌మ్ త‌న‌యుడు త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ధ్రువ్ రెండో సినిమాలో విక్ర‌మ్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. కార్తిక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతుండ‌టం మ‌రింత ఆస‌క్తిదాయ‌కం.

ఇదొక గ్యాంగ్ స్టార్ సినిమా అని, ఇప్ప‌టికే కార్తిక్ సుబ్బరాజ్ క‌థ‌ను వినిపించాడ‌ని, దానికి విక్ర‌మ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ధ‌నుష్- కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా రూపొందుతూ ఉంది. అది పూర్తీ కాగానే విక్ర‌మ్-ధ్రువ్ ల సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడ‌ట ఆ ద‌ర్శ‌కుడు.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?