ప్రభాస్ ఫోన్ వాడతాడా?

ఫోన్ వాడకం అనేది ఇప్పుడు సర్వసాధారణం. ఇక హీరోహీరోయిన్లయితే తమ చేతిలో కాస్ట్ లీ ఫోన్ పెట్టుకొని మరీ ఫొటోలకు పోజులిస్తుంటారు. బాలయ్య లాంటి హీరోలైతే మొబైల్స్ ను జేబులోంచి ఇలా చూసి అలా…

ఫోన్ వాడకం అనేది ఇప్పుడు సర్వసాధారణం. ఇక హీరోహీరోయిన్లయితే తమ చేతిలో కాస్ట్ లీ ఫోన్ పెట్టుకొని మరీ ఫొటోలకు పోజులిస్తుంటారు. బాలయ్య లాంటి హీరోలైతే మొబైల్స్ ను జేబులోంచి ఇలా చూసి అలా చూసి విసిరేస్తుంటారు కూడా. మరి ప్రభాస్ చేతిలో ఫోన్ ఎప్పుడైనా చూశారా? అసలు ప్రభాస్ ఫోన్ వాడతాడా?

దీనికి సంబంధించి ఆసక్తికరమైన వివరాలు బయటపెట్టాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తను ప్రభాస్ ను కలిసిన టైమ్ లో అతడి దగ్గర ఫోన్ ఉన్నట్టు తను ఎప్పుడూ చూడలేదంటున్నాడు నాగి. కనీసం తామిద్దరం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రింగ్ అయినట్టు కూడా తనకు గుర్తులేదంటూ బాంబ్ పేల్చాడు.

నిజానికి ప్రభాస్ కు కూడా ఫోన్ ఉంది. కాకపోతే దాంతో ఆయన చాలా తక్కువ సమయం గడుపుతాడనేది నాగి మాటల అర్థం.  కేవలం ఫోన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాకు కూడా ప్రభాస్ చాలా దూరంగా ఉంటాడని చెబుతున్నాడు ఈ డైరక్టర్. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్.. అందులో ఫాలోవర్స్ ఎంతమంది లాంటి విషయాలు ప్రభాస్ కు అస్సలు తెలియవని చెబుతున్నాడు.

అయితే ప్రభాస్ కు ఒకటి మాత్రం బాగా తెలుసంట. తన దగ్గరకు ఎవరొచ్చినా వాళ్లను హ్యాపీగా, కంఫర్టబుల్ గా ఉంచుతాడట. ఈ విషయంలో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందర్నీ ఒకేలా చూస్తాడట. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే