Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగ్ అశ్విన్ కు సింగీతం గైడెన్స్

నాగ్ అశ్విన్ కు సింగీతం గైడెన్స్

సింగీతం శ్రీనివాసరావు టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ అని చెప్పుకోవాలి. అటు దర్శకత్వ శాఖలో కానీ, ఇటు స్క్రీన్ ప్లే డిపార్ట్ మెంట్ లో కానీ ఆయన అంత సీనియర్ మరొకరు లేరు. మాయాబజార్ కాలంలో కేవి రెడ్డి దగ్గర ప్రారంభించారు ఆయన తన వర్క్. ఇప్పటికీ యాక్టివ్ గా వున్నారు. చాలా అడ్వాన్స్ గా ఆలోచించడం సింగీతం గొప్పతనం.

కమల్ తో మూకీ సినిమా తీసినా, బాలకృష్ణతో టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో సినిమా తీసినా, ఆఖరికి ఆ మధ్యనే అద్దె గర్భాల కాన్సెప్ట్ తో సినిమా తీసినా ఆయనకే చెల్లింది. టిపికల్ స్క్రీన్ ప్లే రైటింగ్ కు ఆయన కేరాఫ్ అడ్రస్.

బహుశా ఈ విషయం గమనించే కావచ్చు, దర్శకుడు నాగ్ అశ్విన్ తన తరువాత సినిమా స్క్రీన్ ప్లే డిపార్ట్ మెంట్ మెంటార్ గా సింగీతాన్ని తీసుకున్నారు. ఇది నిజంగా రేర్ ఫీట్. యంగ్ జనరేషన్ డైరక్టర్లు ఎవ్వరూ సీనియర్లను అందునా ఇంత ఓల్ట్ జనాలను దగ్గరకు రానివ్వరు.

అంతా తమకే తెలుసు, ఆ జనరేషన్ అంతా చాదస్తం అనుకుంటారు. కానీ అలాంటిది సింగీతం టాలెంట్ తెలిసి నాగ్ అశ్విన్ తన భారీ సినిమాకు గైడెన్స్ చేయమని పిలిచి పీట వేసి కూర్చో పెట్టడం అంటే మెచ్చుకోదగ్గ విషయమే.

చంద్రబాబు వైఎస్ఆర్ ఇంటికొచ్చి డబ్బు ఆడిగేవాడు

ఈవిషయం బాబు&కో ఎప్పుడు గమనిస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?