cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఐ మిస్ యు: పరస్పరం పొగుడుకున్న వర్మ, నాగ్

ఐ మిస్ యు: పరస్పరం పొగుడుకున్న వర్మ, నాగ్

దేవుడి కంటే నాగార్జుననే ఎక్కువగా నమ్ముతానని ఒక టైమ్ లో ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ దర్శకుడి అతి గురించి అందరికీ తెలిసిందే కాబట్టే జనాలు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి నాగార్జునపై తన వల్లమాలిన ప్రేమను ప్రదర్శించాడు వర్మ. అదేంటో విచిత్రంగా ఈసారి నాగార్జున కూడా ప్రేమ కురిపించేశాడు.

మహారాష్ట్రలోని ముంబయితో పాటు పలు లొకేషన్లలో ఆఫీసర్ సినిమా షూటింగ్ చేశారు. షూటింగ్ 99శాతం పూర్తయింది. ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్. ఆఖరి షెడ్యూల్ పూర్తిచేసిన నాగ్ హైదరాబాద్ వచ్చేశాడు. ఇప్పటివరకు తీసిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని, ఆర్జీవీని, అతడి టీమ్ ను మిస్ అవుతున్నానంటూ బాధపడే ఎమోజీలతో ట్వీట్ చేశాడు నాగ్. 

అటు వర్మ కూడా తనదైన స్టయిల్ లో బాధను వ్యక్తంచేశాడు. తన టీమ్ తో కలిసి నవ్వుతూ దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఓ ట్వీట్ కూడా వేశాడు.

"నాతో పాటు నా యూనిట్ అంతా నవ్వుతూ సరదాగా ఉన్నట్టు నటిస్తున్నాం. నిజానికి మా బాధను మేం దాచడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం. ప్రేమ ప్రేమను ఎంత ప్రేమిస్తుందో.. అంతకంటే ఎక్కువగా మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం."  ఇది వర్మ ట్వీట్ సారాంశం.

మొత్తమ్మీద ఆర్జీవి, నాగ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా వచ్చేస్తోంది. మే 25న రాబోతున్న ఈ సినిమాతో 'శివ'లా మరో ట్రెండ్ క్రియేట్ చేస్తారా.. లేక వర్మ రొటీన్ సినిమాల్లో 'ఆఫీసర్' కూడా కలిసిపోతాడా అనేది తేలాల్సి ఉంది.