Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగ శౌర్య దూకుడు

నాగ శౌర్య దూకుడు

అశ్వథ్థామ చిత్రానికి థియేటర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ అంతంత మాత్రమే అయినా కానీ ఓటిటిలో, టీవీ ప్రసారాల్లో మాత్రం స్పందన బాగా వచ్చింది. యాక్షన్ సినిమాలు కూడా చేయవచ్చుననే ధీమా రావడంతో లాక్‌డౌన్‌లో శౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ సాధించాడు. అందుకు అనుగుణమైన కథతో ఇటీవలే ఒక సినిమా మొదలు పెట్టాడు. 

అంతకుముందే అతడు మొదలు పెట్టిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా షూటింగ్ కూడా మళ్లీ మొదలయింది. అలాగే మరో రెండు కథలను కూడా నాగశౌర్య ఈ లాక్‌డౌన్‌లో ఓకే చేసాడు. తనకు నచ్చిన కథ దొరికితే నిర్మాత కోసం చూడకుండా స్వీయ నిర్మాణంలో ఐరా క్రియేషన్స్‌పై అనౌన్స్ చేసేస్తున్నాడు. 

తన నిర్మాణంలో చేసే సినిమాల్లో తానే హీరోగా నటించాలని కాకుండా వేరే హీరోలతోను సినిమాలు తీయడానికి శౌర్య ఉపక్రమించాడు. ఛలో తర్వాత ‘నర్తనశాల’తో చేతులు కాలడంతో కాస్త గ్యాప్ తీసుకుని కెరీర్‌ని రీ అనలైజ్ చేసుకున్న శౌర్య ఈసారి దూకుడు చూపిస్తున్నాడు. వన్ సినిమా ఎట్ ఏ టైమ్ అంటూ గ్యాప్ రానివ్వకుండా ఒకేసారి నాలుగైదు సినిమాలు ట్రాక్ ఎక్కించేసాడు. థియేటర్స్ లేకపోతే ఓటిటి ఆప్షన్ ఎలాగో వుందనే ధైర్యంతో శౌర్య ఇంత అగ్రెసివ్ అయిపోయినట్టున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?