cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాగశౌర్యపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్

నాగశౌర్యపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్

హీరో నాగశౌర్యపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకీ నాగశౌర్య కు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గొడవ ఏంటో తెలుసా.... స్టార్ డం మీద. స్టార్ స్టేటస్ మీద ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగశౌర్య ఇచ్చిన సమాధానమే! నేరుగా విజయ్ దేవరకొండ పేరుని ఈ హీరో ప్రస్తావించలేదు కాకపోతే స్టార్స్ అంటే ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు మాత్రమే అన్నట్లుగా చెప్పడం, అంతేకాదు ఒకరోజు ఒక స్టార్ లా నిద్రలేవాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ కోరుకుంటానని చెప్పడమే అసలు కారణం.

టాలీవుడ్ లో నయా సూపర్ స్టార్ గా అవతరించాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల తర్వాత తాజాగా విడుదలైన గీత గోవిందం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది దాంతో అతడ్ని ఏకంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్ళు విజయ్ దేవరకొండ స్టార్ లీగ్ లో చేరాడని ప్రకటించడంతో కాబోలు అతడి అభిమానులు నాగశౌర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అదేపనిగా నాగశౌర్యని ట్రోల్ చేస్తుండటంతో ఎట్టకేలకు స్పందించి నేను అన్నది విజయ్ దేవరకొండని కాదని అంటున్నాడు. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు. వివరణ ఇచ్చాడు కాబట్టి  మరి ఇప్పుడైనా నాగశౌర్యని ట్రోల్ చేయడం మానేస్తారేమో చూడాలి.