cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న మిగిలిన ఇద్ద‌రు సోద‌రుల‌తో పోల్చుకుంటే సినిమాల్లో రాణించ‌లేక‌పోయారు. ఏదో అడ‌పాద‌డ‌పా ఆయ‌న సినిమాల్లో క‌నిపించీ క‌నిపించ‌కుండా ఉన్నారు. జ‌బ‌ర్ద‌స్థ్ లాంటి పాపుల‌ర్ చాన‌ల్‌లో సుదీర్ఘ కాలం పాటు రోజాతో పాటు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించి త‌న ఉనికిని చాటుకున్నారు.

సొంత యూట్యూబ్ చాన‌ల్‌లో వివిధ సామాజిక‌, రాజ‌కీయం అంశాల‌పై త‌న‌దైన శైలిలో మాట్లాడుతూ ఫ‌ర్వాలేద‌నిపించారు. అయితే వివాదాస్ప‌ద అంశాలపై మాట్లాడినప్పుడు మాత్ర‌మే ఆయ‌న హైలెట్ అవుతున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో నంద‌మూరి హీరో బాల‌కృష్ణ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని కామెంట్ చేసి వార్త‌ల‌కెక్కారు. ఆ సంద‌ర్భంలో ఇటు మెగా అభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ రచ్చ చేశారు.

ఆ త‌ర్వాత బాల‌కృష్ణ విష‌య‌మై మ‌రోసారి ఇటీవ‌ల నాగ‌బాబు మాట్లాడాల్సి వ‌చ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొంద‌రు సినీ పెద్ద‌లు క‌ల‌వ‌డంపై బాల‌కృష్ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

భూములు పంచుకోవ‌డానికే అంద‌రూ స‌మావేశ‌మ‌య్యార‌నే బాల‌కృష్ణ ఆరోప‌ణ‌ల‌పై నాగ‌బాబు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. మాట‌లు జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని, నువ్వేమైనా పెద్ద హీరోవ‌నుకుంటున్నావా అని, క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని నాగ‌బాబు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా నాగ‌బాబు సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఆస‌క్తిక‌రంగా ఉంది.  తన తమ్ముడు  పవన్‌కల్యాణ్, నందమూరి హీరో బాలకృష్ణ కలిసి ఉన్న పాత ఫొటోను నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. 

"ఇద్దరు సోదరులు కలిసిన రోజు.. మొదటి వ్యక్తి నా సోదరుడు. రెండో వ్యక్తి మరో  సోదరుడు.. నందమూరి సింహాన్ని పవర్‌స్టార్ కలిసిన రోజు" అంటూ నాగబాబు కామెంట్ చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ క‌లిసిన ఫొటోను షేర్ చేశారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అంతా క‌లిసి ఉండ‌డాన్నే ప్ర‌తి ఒక్క‌రూ ఆహ్వానిస్తారు.

కానీ బాల‌కృష్ణ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని, నోరు అదుపులో పెట్టుకోవాల‌ని...ఇలా ర‌క‌ర‌కాలుగా బాల‌కృష్ణ గురించి హెచ్చ‌రిక‌లు, అవ‌హేళ‌న చేసి నాగ‌బాబు ...ఉన్న‌ట్టుండి నంద‌మూరి సింహం అంటూ ఆకాశానికెత్త‌డం మెగా అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. రెండు రోజుల క్రితం త‌న త‌మ్ముడు ప‌వ‌న్‌కు సంబంధించి పాత ఫొటో షేర్ చేసి ...త‌న ద‌గ్గ‌ర ఇలాంటివి మ‌రికొన్ని ఉన్నాయ‌ని నాగ‌బాబు ప్ర‌క‌టించారు. 

ఇప్పుడు బాల‌కృష్ణ‌తో ప‌వ‌న్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ సింహం సంబోధించ‌డంపై అభిమానుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. నాగబాబు ప్రేమ‌, ఆగ్ర‌హం అతివృష్టి, అనావృష్టి అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయినా ఓ విష‌యాన్ని చెప్ప‌డానికి నిన్న‌మొన్న వ‌ర‌కు తిట్టిన మ‌నిషిని ఆకాశానికి ఎత్తేందుకు ...అంత‌గా దిగ‌జారాలా అనే సీరియ‌స్ కామెంట్స్ కూడా లేక‌పోలేదు. 

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

 


×