cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్: నాగ్, నాగచైతన్య కాంబినేషన్ ఫిక్స్?

ఎక్స్ క్లూజివ్: నాగ్, నాగచైతన్య కాంబినేషన్ ఫిక్స్?

బంగార్రాజు హఠాత్తుగా చనిపోతాడు. అతడి కొడుకు రాము సీన్ లోకి ఎంటరవుతాడు. రాములో మార్పు తీసుకురావడం కోసం, ఊరి గుడిని కాపాడ్డం కోసం బంగార్రాజు ఆత్మ మళ్లీ వస్తుంది. ఇలా నడిచింది సోగ్గాడే చిన్ననాయనా సినిమా. మరి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలంటే ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలి?

క్లైమాక్స్ లో రాము (నాగ్), సీత (లావణ్య త్రిపాఠి) కలిసిపోయారు. వాళ్లకు పండంటి బిడ్డ పుడతాడు. వాడు మరో బంగార్రాజులా తయారవుతాడు. అతడికి కూడా లవ్ ప్రాబ్లమ్ తో పాటు విలన్లతో సమస్య వస్తుంది. అప్పుడు నరకం నుంచి బంగార్రాజు మళ్లీ వస్తాడు. తాత-మనవడు కలిసి ఓ ఆట ఆడుకుంటారు.

బంగార్రాజు ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ చేసిన లైన్ ఇది. దీనిచుట్టూ స్క్రీన్ ప్లే అల్లేశారు. మనవడిగా నాగచైతన్యను ఫిక్స్ చేశారు. అంటే రియల్ లైఫ్ తండ్రికొడుకులు కాస్తా బంగార్రాజు ప్రాజెక్టు కోసం తాత-మనవడుగా మారుతున్నారన్నమాట. వీళ్లకు ఇలా నటించడం కొత్తకాదులెండి.

మనం సినిమాలో కథ ప్రకారం, నాగార్జునకు నాగచైతన్య తండ్రి అయ్యాడు. ఆ విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చూపించారు మనం సినిమాలో. సో.. బంగార్రాజులో కూడా తాతమనవడిగా నాగ్-చైతూలను అంతే పక్కాగా చూపిస్తారట. కల్యాణ్ కృష్ణ డైరక్షన్ లో త్వరలోనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయబోతున్నాడు నాగార్జున. 

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్