Advertisement

Advertisement


Home > Movies - Movie News

మా సినిమాను ఓటీటీ మూవీగా చూడొద్దు ప్లీజ్

మా సినిమాను ఓటీటీ మూవీగా చూడొద్దు ప్లీజ్

త్వరలోనే వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు నాగార్జున. దయచేసి ఈ సినిమాను ఓటీటీ మూవీగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇన్నాళ్లూ దీన్ని ఓటీటీ మూవీగా ఎవరైనా భావిస్తే, వెంటనే మైండ్ లోంచి ఆ మేటర్ ను డిలీట్ చేసేయాలని కోరుతున్నాడు.

"వైల్డ్ డాగ్ ను ఓటీటీ సినిమాగా చూడొద్దు. దీన్ని థియేట్రికల్ రిలీజ్ కోసమే తీశాం. సినిమాలో సౌండ్ ఎఫెక్టులు, విజువల్ ఎఫెక్టులు అన్నీ బిగ్ స్క్రీన్ కోసమే చేశాం. దయచేసి వైల్డ్ డాగ్ ను ఓటీటీ సినిమాగా చూడొద్దు. ఆ విషయాన్ని మరిచిపోండి. ఎక్స్ క్లూజివ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ ను రిలీజ్ చేస్తున్నాం."

వైల్డ్ డాగ్ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నామని చెప్పడం కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేశాడు నాగ్. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. ఓటీటీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, ఎందుకు మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందో వివరించాడు.

"నవంబర్ కే సినిమా అయిపోయింది. కరోనాతో ఏం చేయాలో అర్థంకాలేదు. థియేటర్లు ఓపెన్ అయితే ప్రేక్షకులు వస్తారా అనే అనుమానం నా మైండ్ లో ఉంది. అందుకే ఓటీటీ రిలీజ్ కు ఓకే అన్నాను. కానీ క్రాక్, ఉప్పెన సినిమాలతో నా మైండ్ సెట్ మారిపోయింది. మంచి సినిమా తీస్తే థియేటర్లలో ఆదరిస్తారనిపించింది. అందుకే ఓటీటీ నుంచి వైల్డ్ డాగ్ ను వెనక్కి తీసుకున్నాం."

తమ సినిమాను థియేటర్లలోనే చూడాలంటున్నాడు నాగ్. ఫైట్స్ తో పాటు తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నాడు. 

Click Here For Photo Gallery

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

క‌మ్మవాళ్ళు వైఎస్ కు ఓట్లేసింది అందుకే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?