నాగశౌర్య చాలా కష్టపడి ఫిజిక్ బిల్డ్ చేస్తున్న సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ఆసియన్ సునీల్, శరత్ మరార్, రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ కోసం మొదటి నుంచీ వేట సాగుతూనే వుంది.
విలువిద్య నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ కావాలని అనుకున్నారు. అసలు అంతకు ముందు ధనుర్దారి అనుకున్నారు. కానీ అది వేరే వాళ్ల దగ్గర వుండడంతో కుదరలేదు. పార్ధు టైటిల్ ను త్రివిక్రమ్ కోసం రిజిస్టర్ చేసి వుంచారు. అందువల్ల అది కుదరలేదు.
ఆఖరికి లక్ష్యం అనే టైటిల్ అనుకున్నారు. కానీ కొన్నేళ్ల క్రితమే ఈ టైటిల్ తో గోపీచంద్ సినిమా చేయడంతో దాన్ని కూడా పక్కన పెట్టారు. ఆఖరికి లక్ష్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనినే రేపు ఉదయం ప్రకటించబోతున్నారు.
సుబ్రహ్మణ్యపురం సినిమా తరవాత దర్శకుడు సంతోష్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం నాగశౌర్య ఏకంగా ఎయిట్ ప్యాక్ చేసి, ఫిజిక్ ను ఫిట్ గా తయారుచేసుకున్నాడు.