cloudfront

Advertisement


Home > Movies - Movie News

అప్పటి నగ్మాను ఇప్పుడు చూడగలమా?

అప్పటి నగ్మాను ఇప్పుడు చూడగలమా?

ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన మెరిసిన నగ్మా దాదాపు సినిమాలు ఆపేసింది. రీఎంట్రీలో హీరోయిన్లకు అమ్మగా కూడా నటించి, ఆ అధ్యాయాన్ని కూడా ముగించేసింది. ఈమె నుంచి మరో సినిమా వస్తుందంటే అది అమ్మ క్యారెక్టర్ మాత్రమే అని అంతా అనుకుంటారు. కానీ తనే లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తానని ప్రకటించింది నగ్మా.

టాలీవుడ్ నుంచి మంచి సబ్జెక్ట్ వచ్చిందని, అది థ్రిల్లర్ మూవీ అని ప్రకటించింది ఈ మాజీ హీరోయిన్. ఆ స్టోరీలైన్ తనకు బాగా నచ్చిందంటున్న నగ్మా, సినిమా చేస్తాననే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అంటోంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం లోక్ సభ ఎన్నికలపై ఉందని, ఎంపీగా పోటీచేసే విషయంపై సీరియస్ గా ఉన్నానని, ఎన్నికల తర్వాత టాలీవుడ్ లో నటించే అంశంపై ఆలోచిస్తానని తెలిపింది.

యాక్టర్స్ వయసు చూడకూడదని అంటోన్న నగ్మా.. టాలీవుడ్ ఎప్పుడూ తనను ప్రేమిస్తూనే ఉందని, ఆ ప్రేమను తిరిగివాళ్లకు పంచుతానంటోంది. నటీనటులకు ప్రోత్సాహం అవసరమని, తనను ప్రోత్సహిస్తే మరింత బాగా నటిస్తానని చెబుతోంది.

అంతా బాగానే ఉంది కానీ ఈ వయసులో నగ్మాను లీడ్ రోల్ లో పెట్టి సినిమా చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో అర్థంకావడం లేదు. వయసు సంగతి పక్కనపెడితే, ఆమెను తెరపై చూసేంత ధైర్యం ఎవరికీ లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో అయితే ఓకే కానీ, సినిమా మొత్తం ఆమెనే చూసే పరిస్థితి వస్తే మాత్రం ప్రేక్షకుడికి అది కాస్త కష్టతరమైన పనే. 

టీడీపీ బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపెవరిది 

లాభం లేదబ్బా ఈసారి ఆ ఎమ్మెల్యేను దించాల్సిందే