ప్రేమలో ఉంటాం కానీ ఆ విషయం గ్రహించడానికి కొంచెం టైమ్ పడుతుందని అంటోంది నమ్రత. కెరీర్ స్టార్టింగ్ లో మహేష్ తో తను క్లోజ్ గా ఉన్నప్పటికీ ప్రేమలో పడిన విషయం మాత్రం ఒక టైమ్ లో అర్థమైందని చెప్పుకొచ్చింది. ఆ ప్రత్యేక సందర్భాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది నమ్రత. ఈ మేటర్ తో పాటు.. తన భర్త మహేష్, పిల్లల గురించి నమ్రత ఏం చెబుతోందో చూద్దాం.
– మహేష్ ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడు తెలిసింది?
న్యూజిలాండ్ లో 52 రోజుల లాంగ్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ఆఖరి రోజున నాకు తెలిసింది నేను మహేష్ ప్రేమలో పడినట్టు.
– మహేష్ తో పెళ్లికి మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా
మహేష్ ను చూసిన తొలి చూపులోనే వాళ్లు ప్రేమలో పడిపోయారు. ఇంకేం చెప్పాలి.
– మహేష్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అభద్రతాభావం ఫీలవుతుంటారా?
మాకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. సో.. ఇన్-సెక్యూరిటీ అనే ఫీలింగ్ కు మా మధ్య చోటు లేదు.
– మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ ఏంటి
ఇది లాక్ డౌన్ టైమ్. కాబట్టి ఎలాంటి ప్లానింగ్ లేకపోవడమే బెస్ట్ ప్లానింగ్
– లాక్ డౌన్ లో ఓ మంచి అనుభవం
ఎప్పట్నుంచో అనుకుంటున్న మా పెరడు మొత్తం సెట్ చేశాను. నేను ఎలా ఊహించుకున్నానో ఇప్పుడది అలా తయారైంది. మొత్తం పచ్చదనం, పక్షులు.
– సర్కార్ వారి పాట కథ ఎలా ఉంటుంది?
ఇప్పుడే చెప్పలేను కానీ సినిమాలో ప్రతి ఎలిమెంట్ ను అంతా బాగా ఎంజాయ్ చేస్తారు
– ఒక్కడు సినిమా గురించి
ఒక్కడు సినిమా ఓ క్లాసిక్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్నిసార్లయినా చూడొచ్చు.
– మహేష్-పూరి కాంబోలో సినిమా?
అది కాలమే నిర్ణయిస్తుంది
– మహేష్ సినిమాల్లో చొరవ తీసుకుంటారా?
నా ప్రమేయం అస్సలు ఉండదు.
– సితార-గౌతమ్ తెలుగు మాట్లాడతారా?
వాళ్లు తెలుగు, ఇంగ్లిష్, మరాఠీ చక్కగా మాట్లాడతారు.
– లాక్ డౌన్ కు ముందు సందర్శించిన ప్రదేశాలు
న్యూయార్క్, దుబాయ్
– ఆనందంగా, ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారు
కడుపునిండా తింటాను. బాగా ఎక్సర్ సైజ్ చేస్తాను. తొందరగా నిద్రపోతాను
– మీ ఫేవరెట్ జ్యూవెలరీ
నా తాళి