Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాని గారూ...నాని సినిమాకే రూల్స్ నా?

నాని గారూ...నాని సినిమాకే రూల్స్ నా?

మంత్రి నాని పదే పదే చెబుతూ వచ్చారు. అధిక ధరలకు అమ్మితే ఊరుకోవాలా? లైసెన్స్ లు లేకుండా నడిపితే సహించాలా? అనే విధంగా మాట్లాడుతూ వచ్చారు. శ్యామ్ సింగ రాయ్ సినిమా విడుదల టైమ్ లో వీఆర్వోలకు సినిమా థియేటర్ల బాధ్యతలు అప్పగించారు. ఆర్వీవోలు థియేటర్ల టికెట్ రేట్లు ఆరా తీసారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు టికెట్ లు అమ్మి ధియేటర్లు నడపలేక ఏవో కారణాలు చెప్పి చాలా థియేటర్లు మూత పెట్టారు. 

ఆ జిల్లాలో ఇన్ని థియేటర్లు మూసేసారు, ఈ జిల్లాలో ఇన్ని థియేటర్లు మూత పడ్డాయి అంటూ వార్తలు తెగ వినిపించాయి. కనిపించాయి. పాపం, శ్యామ్ సింగ రాయ్ సినిమాకు జెన్యూన్ గా రావాల్సిన కలెక్షన్లు రాకుండాపోయాయి.

కట్ చేస్తే సంక్రాంతి సీజన్ వచ్చేసింది. అయిపోయింది కూడా. ఎమ్మార్వోలు, వీఆర్వోలు, ఆర్డీవోలు ఎక్కడున్నారో తెలియలేదు. మూత పెట్టిన థియేటర్లు కూడా తెరచుకున్నాయి. టికెట్ రేట్లు మళ్లీ రెక్కలు విప్పుకున్నాయి. సీడెడ్ లో యూనిఫారమ్ 200 కూడా అమ్మేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రలో యూని ఫారమ్ 100 రూపాయలకే అమ్మేసారని వార్తలు వచ్చేసాయి.

అంటే కేవలం బకరా అయిపోయింది శ్యామ్ సింగ రాయ్ మాత్రమే అన్నమాట. జగన్ లాంటి సిఎమ్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అంటారు కదా? మరి ఇదెక్కడి పద్దతి అని జనం మాట్లాడుకుంటున్నారు. ప్రతి ప్రశ్నకు మంత్రి నాని చాలా తెలివిగా సమాధానాలు చెబుతారు. మరి దీనికి ఏమని చెబుతారో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?